|
Context
Song Context:
తెలియదా మా గుణం విలువలే మా బలం
మనబలంలేక జనబలంలేక గెలుపుని దేని పెట్టి కొనగలం |
Song Lyrics
||ప|| |అతడు|
నరనరాల్లో ఉత్సాహం ఉరకలేసే యువతరం
జరుపుతుంటే పోరాటం దొరకదా విజయం
పదవులే లే ఉబలాటం తరుముతుంటే తక్షణం
పవరు కోసం ప్రారంభం ఎన్నికల సమరం
||ఖోరస్||
నేడీ కళాశాలలో ఎలక్షన్లలో గెలిస్తే సరి
అదిగో ఇదే దారని పిలుస్తున్నది అసెంబ్లీ మరీ
|అతడు|
మాయ మాటల్ని నమ్మొద్దు మంచికివ్వండి మద్దత్తు
మార్చుకోకండి మీ రూటు మాకే వెయ్యండి మీ ఓటు
|| నరనరాల్లో ||
.
||చ|| |అతడు|
ఉన్నవాళ్లు చిన్నవాళ్లు ఆడవాళ్లు కోడెగాళ్లు
ఆర్ట్సు వాళ్లు సైన్సు వాళ్లు సీనియర్లు జూనియర్లు
||ఖోరస్||
భేదాలు మానండి పిడివాదాలు వినకండి
అంతా కలిసిరండి మనమంతా ఒకటి లెండి
మురికి వాళ్లు చురుకు వాళ్లు…పిరికి వాళ్లు
బైకు వాళ్లు…సైకిలోళ్లు…క్లాస్ వాళ్లు…మాస్ వాళ్లు
||ఖోరస్||
నానా రకాలండి ఏకమైతే ఎలాగండి
కంగారు పడకండి గొర్రె మందై నడవకండి
|అతడు|
మనదొకే గురుకులం మంచికై ఉరుకుదాం
కాకులం మాను మాకులం మేక మూకలం కాదుగా మనం
|| మాయ మాటల్ని ||
|| నరనరాల్లో ||
.
||చ|| |అతడు|
కులమని కుంపటెట్టి మతమని మందూ పెట్టి
ప్రాంతాల పేరు పెట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టి
||ఖోరస్||
పంతాలు పెంచమండి ఉన్న బంధాలు తెంచమండి
పంగనామాలు పెట్టమండి వంగి దండాలు ఎందుకండి
|అతడు|
క్యాంపస్లో కాళ్లు పట్టి క్యాంటీన్లో టీలు కొట్టి
నమ్మేట్టు ఒట్టు పెట్టి నచ్చేట్టు ఆశ పెట్టి
||ఖోరస్||
హామీలు ఇవ్వకుంటే మీకు ఏ మేలు చెయ్యమంటే
ఓటేసి పొండి అంటే ఓడిపోతారు తప్పదంతే
|అతడు|
తెలియదా మా గుణం విలువలే మా బలం
మనబలంలేక జనబలంలేక గెలుపుని దేని పెట్టి కొనగలం
|| మాయ మాటల్ని ||
|| నరనరాల్లో ||
|| మాయ మాటల్ని ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)