క్లాస్స్ మేట్స్: మౌనమెందుకు మాటాడవెందుకు

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Classmates
Song Singers
   Mallikarjun,
   Anjana Soumya
Music Director
   Koti
Year Released
   2007
Actors
   Sumant,
   Sada,
   Sharvanand,
   Kamalini Mukharjee
Director
   Vijaya Bhaskar
Producer
   Sravathi Ravi Kishore

Context

Song Context:
   ఎద మారుమూల ఉన్న మాట దాచి ఉంచకు
   ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు!

Song Lyrics

||ప|| |ఆమె|
       మౌనమెందుకు మాటాడవెందుకు
       దూరమెందుకు దరి చేరవెందుకు
       ఎద మారుమూల ఉన్న మాట దాచి ఉంచకు
       ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు
                            ||మౌనమెందుకు||
.
||చ|| |అతడు|
       అంత బిగువా మెట్టు దిగవా
       ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవా
|ఆమె|
       ఇంత తెగువా మాట వినవా
       కొంత కష్టం అయినా కాస్త ఆగవా
|అతడు|
       మది నాకు చెప్పకుండా నీ వెంట పడ్డది
|ఆమె|
       మన చేతిలోన ఉందా ఈ ప్రేమ పద్ధతి
|అతడు|
       తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
|ఆమె|
       దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
                             ||మౌనమెందుకు||
.
||చ|| |ఆమె|
       రెచ్చగొట్టినా నవ్వుతున్నదే మత్తు కమ్మేసిందా కన్నె మనసుని
|అతడు|
       ఎంత కుట్టినా కెవ్వుమనదే పువ్వు పొమ్మంటుందా తేనెటీగని
|ఆమె|
       నిను చూడకుంటే ప్రాణం ఇక నిలవనన్నది
|అతడు|
       పదునైన పూలబాణం నను తాకుతున్నది
|ఆమె|
       దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
|అతడు|
       తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
                              ||మౌనమెందుకు||
.
.
                        (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)