|
Context
Song Context:
నరులజాతి అంతా సరిసమానమైనా ఆడమగల తేడా ఎవరి కల్పన
స్వేచ్చ అన్నదేవరో పరులు ఇవ్వరమ్మా పోరి గెల్చుకోక తప్పదే
అంతరాలు ఎరుగని అణచివేత జరుగని నీ చరిత్ర నీవె రాసుకో ! |
Song Lyrics
||ప|| |అతడు|
నిత్యం రగులుతున్న అగ్నిపర్వతం
ప్రాణం విసిగిఉన్న మగువ జీవితం
కోరస్: ।।నిత్యం।।
అతడు : ఓ సమాజమా కోరస్: ఓ సమాజమా
అతడు: ఆ మహానలం కోరస్: ఆ మహానలం
అతడు: ఏ క్షణాన పైకి పగులునో
ఆ గడియ నీకు విలయమే సుమా!
కోరస్: ఆ గడియ నీకు విలయమే సుమా!
అతడు & కోరస్: ।।నిత్యం।।
.
చరణం:
అతడు: పుస్తకాల పుట్టలలో కోరస్: చెదలు తిన్న ధర్మమా
అతడు: వర్తమాన చరితలో కోరస్: భవిత గతిని చూడుమా
అతడు: శీలమంటే దేహమా కోరస్: మచ్చ్చలేని హృదయమా
అతడు: ఎక్కడుందో తేల్చవా ? కోరస్: దిక్కులేని శాస్త్రమా
అతడు: నీతి సూత్రమంతా నారి కోసమేనా? బదులు పలకవేమే పురుషన్యాయమా ?
సాటి మనిషి లాగ స్త్రీని చూడలేక వెంట తరుముతున్న సంఘమా
పాప భారమోపక భూమికున్న ఓపిక నీ పునాది కూల్చివేయగా
అతడు & కోరస్: ।।నిత్యం।।
.
చరణం: అతడు & కోరస్:
రాముడైనా ఇచ్చేనా చితుల నుండి రక్షణ
నీకు నీవే ఇచ్చుకో ఎదురుతిరుగు శిక్షణ
భీముడైనా ఆపెనా వలువ లొలుచు వంచెనా
నీవు తెగువ చూపితే నరకుడైన నిలుచునా
అతడు :
నరులజాతి అంతా సరిసమాన మైనా ఆడమగల తేడా ఎవరి కల్పన
స్వేచ్చ అన్నదేవరో పరులు ఇవ్వరమ్మా పోరి గెల్చుకోక తప్పదే
అంతరాలు ఎరుగని అణచివేత జరుగని నీ చరిత్ర నీవె రాసుకో !
అతడు & కోరస్: ।।నిత్యం।।
.
.
(Contributed by Bhagirathy) |
Highlights
[Also refer to Pages 128 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)