ప్రేమించుకుందాం రా: మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Preminchukundam raa
Song Singers
   S.P. Balu,
   Chitra
Music Director
   Mahesh
Year Released
   1997
Actors
   Venkatesh,
   Anjala Jhaveri
Director
   Jayant C. Paranji
Producer
   D. Suresh Babu

Context

Song Context:
   తొలిసారి నిను చూసి మనసాగక పిలిచానే చిలకమ్మ మెలమెల్లగ
   తెలుగంత తీయ్యంగ - నువు పలికావే స్నేహంగా

Song Lyrics

||ప|| |ఆతడు|
       మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా!
       నవరాగంలో నవ్వింది నా మొనాలిసా!
       ఈగాలి రేపింది నాలో నిషా
       చెలరేగాలి రమ్మంది హల్లో అంటూ
       ఒళ్ళొ వాలె అందాల అప్సరస
ఆమె:
       మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా!
       నవరాగంలో నవ్వింది నీ మొనాలిసా!
       ఈగాలి రేపింది నాలో నిషా
       అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ
       అల్లేసింది నీమీద నా ఆశ
.
చరణం: అతడు:
       తొలిసారి నిను చూసి మనసాగక
       పిలిచానే చిలకమ్మ మెలమెల్లగ
       తెలుగంత తీయ్యంగ - నువు పలికావే స్నేహంగా
ఆమె:
       చెలిమన్న వలవేసి నను లాగగా - చేరాను నీ నీడ చల చల్లగా
       గిలిగింత కలిగేలా - తొలివలపంటె తెలిసేలా
అతడు:
       కునుకన్న మాటే నను చేరక
       తిరిగాను తెలుసా ఏం తోచక
                              || మేఘాలే ||
.
చరణం: ఆమె:
       తొలిపొద్దు వెలుగంత చిరువేడిగా
       నిలువెల్ల పులకింత చిగురించగా
       దిగులేదో హాయేదో గుట్టు చెరిపింది ఈ వింత
అతడు:
       ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా
       నిజమేదో కలయేదో మరిపించగా
       పగలేదో రేయేదో రెండు కలిసాయి నీ చెంత
ఆమె:
       ప్రేమంటే ఇంతేనేమో మరి
అతడు:
       దానంతు ఏదొ చూస్తే సరి
                               మేఘాలే ||
.
.
                   (Contributed by Venkata Sreedhar)

Highlights

    ప్రేమంటే ఇంతేనేమో మరి
.
    దానంతు ఏదొ చూస్తే సరి
.
[Also refer to Pages 219-220 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)