Posted by admin on 29th January 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A Love Song |
Song Lyrics
||ప|| |అతడు|
పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది
ఆమె:
పాడుసిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది
అతడు:
జోడుకట్టిచూడు నిన్ను ఏడిపించదింక ఈడు
ఆమె:
నచ్చచెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జతకూడు
అతడు:
కాసుకో అమ్మడూ కొంటె దూకుడు
||పైట కొంగు||
.
చరణం: అతడు:
సొగసులు ఇమ్మని నిను బతిమాలని
ఆమె:
తెగపడి రమ్మని పిలవకు వయసుని ||సొగసు||
అతడు:
అదిరిపడే పెదవులలో అనుమతినే చదవని
ఆమె:
బిడియపడే మనసుకథ అడుగకు పైపదమని
అతడు:
బెదురు ఎంతసేపని ఎవరున్నారని
ఆమె:
అదునుచూసి గమ్మని అందాలయ్యా అందాన్ని
||పైట కొంగు||
.
చరణం: ఆమె:
చలి చలి గాలిలో చమటలు ఏంటట
అతడు:
వలపుల లీలలో అది ఒక ముచ్చట ||చలి||
ఆమె:
ఎదురుపడే మధనుడితో వరస ఎలా కలుపుట
అతడు:
యదను వీడే తరుణములో తెలియనిదేముందట
ఆమె:
మాయదారి ప్రేమలో ఎంచెయ్యాలంటట
అతడు:
మోయలేని హాయిలో ఒళ్ళోకి వస్తే చాలంట
||పైట కొంగు ||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)