ఖడ్గం: నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వు

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Khadgam
Song Singers
   Sumangali
Music Director
   Devisri Prasad
Year Released
   2002
Actors
   Srikanth,
   Ravi Teja,
   Prakash Raj,
   Sonali Bendre
Director
   Krishna Vamsi
Producer
   Sunkara Madhumurali

Context

Song Context:
     ప్రతి నిమిషం నువ్వు - నేనంతా నువ్వు - నేనంటే నువ్వు!

Song Lyrics

||ప|| |ఆమె|
       నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వు ||2||
       నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
       నా పెదవి పైన నువ్వు నా మెడ వంపున నువ్వు
       నా గుండె మీద నువ్వు ఒళ్లంతా నువ్వు
       బుగ్గల్లో నువ్వు మొగ్గల్లే నువ్వు ముద్దేసే నువ్వు
       నిద్దర్లో నువ్వు పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వు
                                               ||నువ్వు ||
.
||చ|| |ఆమె|
       నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
       నా మనసును లాలించే చల్లదనం నువ్వు
       పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
       బయటపడాలనిపించే పిచ్చిదనం నువ్వు
       నా ప్రతి యుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు
       నా ప్రియ శతృవు నువ్వు నువ్వు
       మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు
       నచ్చే కష్టం నువ్వు నువ్వు
                                  || నువ్వు ||
.
||చ|| |ఆమె|
       నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
       నా వన్నెలు దోచుకునే కోరికవే నువ్వు
       మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
       నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
       తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
       తప్పని స్నేహం నువ్వు నువ్వు
       తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
       ఐనా ఇష్టం నువ్వు నువ్వు… నువ్వు
                                  ||నువ్వు ||
.
||చ|| |ఆమె|
       మైమరపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
       నే కోరుకునే నా మరో జన్మ నువ్వు
       కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
       నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
       నా అందం నువ్వు ఆనందం నువ్వు
       నేనంటే నువ్వు నా పంతం నువ్వు
       నా సొంతం నువ్వు నా అంతం నువ్వు
                                  ||నువ్వు||
.
.
                (Contributed by Nagarjuna)

Highlights

     నచ్చే కష్టం నువ్వు నువ్వు
     నా అందం నువ్వు ఆనందం నువ్వు
     నేనంటే నువ్వు నా పంతం నువ్వు
.
     నా సొంతం నువ్వు నా అంతం నువ్వు!

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)