|
Context
Song Context:
అమ్మ నన్ను చనిపొయిననాన్న లాగా మిలిటరీలోకి వేళ్ళొద్దంటుంది, కాని నా ఆశయం నాన్నలాగే మిలిటరీలో చేరాలి
.
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా…
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ |
Song Lyrics
||ప|| |అతడు|
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా
చెరిగిన శాంతి చెదిరిన కాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
||నా పాదం ||
.
||ప|| |అతడు|
కమ్మని జోలలతో చిననాటి ఆ కల
కమ్మిన జ్వాలలతో నిలిచింది కన్నులా
తీయని ఊహలా తీరని ఆశలా
అలనాటి జ్ఞాపకాల కోవెల
కోయిల పాటలా కోరిన కోటలా
పిలిచింది నన్ను కోటి గొంతులా
చెరిగిన శాంతి చెదిరినకాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
||నా పాదం ||
.
||చ|| |అతడు|
నీ కొనవేలితో మొదలైంది ఈ కదం
నీ చనుబాలతో పదునైంది పౌరుషం
నీ ఎదలో లయ వినపడనీయక
నను ఆపకమ్మ కాలు తూలగా
నీ కనుపాపలో కాంతిని ఈయక
కరిగించకమ్మ కంటి నీరుగా
చెరిగిన శాంతి చెదిరిన కాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
||నా పాదం ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Sirivennelisque Conceptualization
.
నీ కొనవేలితో మొదలైంది ఈ కదం
నీ చనుబాలతో పదునైంది పౌరుషం
నీ ఎదలోలయ వినపడనీయక
నను ఆపకమ్మ కాలు తూలగా
నీ కనుపాపలో కాంతిని ఈయగా
కరిగించకమ్మ కంటి నీరుగా
చెరిగిన శాంతి చెదిరిన కాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ!
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)