|
Context
Song Context:
ప్రేమ సీమలో ప్రవేశం యవ్వనానికే లభిస్తుంది! |
Song Lyrics
||ప|| |అతడు|
చిటికేస్తే అలలైనా నిలువెల్లా ఆగాలి
అడుగేస్తే శిలలైనా తరగల్లా ఆడాలి
ఏదైనా సాధించే వయసు ఇవ్వాళుంటుంది
చేజారిపోయిందో నిన్న అయిపోతుంది
లవ్వైనా నవ్వైనా ఇపుడే మహ బాగుంటుంది
పళ్లూడిపోతే ఇక చేసేదేముంది
|| చిటికేస్తే ||
.
||చ|| |అతడు|
ప్రేమ సీమలో ప్రవేశం యవ్వనానికే లభిస్తుంది.హో..హో
టైము దాటితే గుడైనా రెండు తలుపులూ బిగిస్తుందీ..హో..
ఏ ఈడుకీ ఆ ముచ్చట అన్నారుగా పెద్దాళ్లంతా
ఆ మాటకీ అవునన్నది కుర్రాళ్ల సంత
ఈ వయసులో ఈ నిద్దుర స్వప్నాలకి తొలి పొద్దంట
అంచేత నువ్వా కలలనీ వెంటాడమంట
|| చిటికేస్తే ||
.
||చ|| |అతడు|
ఒక్క స్వప్నమూ కనుల్లో లేని వాళ్లనీ వెలేయండి హో హో
కళ్లు కావివి నిజంగా గాజు గుళ్లని అనేయండి
ఆవేశమో ఆరాటమో ఏ భావమో తరుముతు ఉంటే
నీ జీవితం కాదా మరీ గోదారిలో నావ
ఆయాసమే సావాసమై ఆగాలి అనిపించిందంటే
ఆ రోజుతో నీకే నువ్వు భారంగా అయిపోవా
|| చిటికేస్తే ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
చిటికేస్తే అలలైనా నిలువెల్లా ఆగాలి
అడుగేస్తే శిలలైనా తరగల్లా ఆడాలి
ఏదైనా సాధించే వయసు ఇవ్వాళుంటుంది
చేజారిపోయిందో నిన్న అయిపోతుంది
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)