|
Context
Song Context:
స్పైడర్‌మేన్! సాలెగూడు అల్లావే గుండెల్లో తేనేపట్టు రేపావే నాలో! |
Song Lyrics
||ప|| |ఆమె|
స్పైడర్‌మేన్ స్పైడర్‌మేన్ స్పైడర్‌మేన్
అతడు:
స్పైడర్‌మేన్ స్పైడర్‌మేన్ స్పైడర్‌మేన్
ఆమె:
సాలెగూడు అల్లావే గుండెల్లో తేనేపట్టు రేపావే నాలో
||స్పైడర్‌మేన్ ||
ఆమె:
కళ్ళలోకి కొంటెగా కళ్ళు పెట్టి చూడగా
మాయదారి మైకం ఏదో ఎదలో కదిలెను కద
|అతడు| ||స్పైడర్‌మెన్||
.
చరణం: ఆమె:
ముళ్ళై తాకి రేపింది కల్లోలం నా చెంప నిమిరిన నీ వేలు
అతడు:
నేనే ఏదో చేసానని అన్యాయం నా వైపే చూస్తాయేం కళ్ళు
ఆమె:
మరి నేనే నిను పిలిచానా మది వాకిలి తెరిచుందని
రారమ్మని అడిగానా చొరవగ చొరబడి పొమ్మని
హాయో మాయో నాకే తెలియందే ఏం తోచనీయదు ఏమాత్రం
అతడు:
అయ్యో పాపం అసలేం జరిగుంటుందని కాసేపు కలిసాలోచిద్దాం
ఆమె:
అసలే మతిచెడి నేనుంటే అడుగడుగున వెంటాడకు
నీ వలనే ఈ గొడవ అది తెలియని పసివాడివా
||స్పైడర్‌మేన్||
.
చరణం: ఆమె:
స్నానం చెయ్యాలంటే వీలుందా నువ్వట్టా ఎగబడి చూస్తుంటే
అతడు:
చిత్రం కాదా నువ్వు చూసే నీ నీడ అచ్చంగా నాలా ఉందంటే
ఆమె:
మరి ఎందుకిలా నా చేతులు మొహమాటం పడుతున్నై
నా నడుమును తాకేందుకే తెగ సతమతమవుతున్నావి
నువ్వే చేరి నాలో ఏకాంతం దోచావొ ఏమో తుంటరిగా
అతడు:
నువ్వు కోరి చోటిస్తే ఈ మాత్రం నిన్ను అల్లుకుపోనా అల్లరిగా
ఆమె:
ప్రతి అణువణువు నునువెచ్చని గిలిగింతలు కలిగించి
ఎద చేరిన నిను వదలను చిలిపిగా నిను బంధించి
|అతడు| ||స్పైడర్‌మేన్||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)