|
Context
Song Context:
చందమామ కథ - మరో ప్రేమ కథ కూడా!
|
Song Lyrics
||ప|| |ఆమె|
అనగనగా ఒక రాజు గగనమునేలే మహరాజు
కనపడలేదా యువరాణి ఈ రోజు
||అనగనగా ||
|ఆమె|
నీ చిన్ని వేలు అందించు చాలూ
కదలి వస్తాడు కథలు చెబుతాడు
|అతడు|
పండుగల్లే తానొచ్చి పండు వెన్నలే తెచ్చి నీకందిస్తాడు ||2||
ఏడి వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు
జాడైన చూడనీడు ఎందుకో నడిరేయి సూరీడు
|ఆమె|
పదహారు కళలు ఎదలోనే ఎపుడూ దాచేసుకుంటాడా
తన పైడి సిరులు మనకంటికెన్నడూ చూపించనంటాడా
|| ఏడి వెన్నెల ||
.
||చ|| |అతడు|
అమ్మ ఒళ్ళో చిన్నపుడు నమ్మకంలో ఉన్నపుడూ
బొమ్మలా నీ అరచేతుల్లో లేడా చందురుడూ
|ఆమె|
మామయ్యంటారు వరసై పసివాళ్లు
మచ్చను చూస్తారు వయసెదిగినవాళ్లు
|అతడు|
వెన్న ముద్దనే చూసి మన్ను ముద్దల్లే తోచి ఎప్పుడొదిలేశారు
|ఆమె|
తెలివి తెర వేసి తెలిసి వెలి వేసి
తరిమి కొడితే సరే అని అలా అంతెత్తున నిలిచాడు
|| ఏడి వెన్నెల ||
||అనగనగా||
.
||చ|| |అతడు|
ఆ కన్నె చూపుల లోగిలికీ కొంటె ఊహల వాకిలికీ
పల్లకీలో పచ్చని ఆశలు పట్టుకు వస్తాడు
|ఆమె|
ఆ సిగలో సిరిమల్లై సిగ్గులు పూస్తాడు
మదిలో విరిముల్లై సందడి చేస్తాడు
|అతడు|
వెచ్చగా కవ్వించి చల్లగా నవ్వించి ఆటాడేస్తాడు
|ఆమె|
వలపు విలుకాడు చిలిపి చెలికాడు
కనులు వెతికే కలే తనై నిజంలా ఎపుడెదురవుతాడు
|| ఏడి వెన్నెల ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
“అమ్మ ఒళ్ళో చిన్నపుడు నమ్మకంలో ఉన్నపుడూ!” Isn’t that a Sirivennela Phrase?
.
Only a certain Sirivennela can conceptualize this type of complicated situations - two parallel tracks in one song with such a sweet imagination!
మహరాజు, చందురుడూ, the male lead - all are the same, but in two different contexts!
యువరాణి, the female lead are the same!
The male lead is only SSC (10th) graduate (in a family of well educated folks, is an intelligent and practical guy) is constantly ridiculed by his dad for being poor in studies is captured in “తెలివి తెరవేసి తెలిసి వెలివేసి తరిమి కొడితే సరే అని అలా అంతెత్తున నిలిచాడు”.
The song starts in the context of pacifying a crying kid with చందమామ కథ!
Excepting the last charanam every thing else runs in the two parallel tracks!
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)