Movie Name Murari Singers S.P. Charan, Harini Music Director Mani Sharma Year Released 2001 Actors Mahesh Babu, Sonali Bendre Director Krishna Vamsi Producer Nandigam Devi Prasad
Context
Song Context: A Romantic song between a boy and a girl in love
Song Lyrics
||ప|| |అతడు|
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
|ఆమె|
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
|అతడు|
నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో
|ఆమె|
పూవానగా కురుస్తున్నదీ నా చూపులో మెరుస్తున్నది
|అతడు|
ఏ వూరే అందమా ఆచూకీ అందుమా
|ఆమె|
కవ్వించే చంద్రమా దొబూచీ చాలమ్మా ||ఎక్కడ||
.
||చ|| |అతడు|
కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులూ
పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలుకలూ
|ఆమె|
పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులూ
పరుగులో ఆ అడుగులు గోదారిలో వరదలు
|అతడు|
నా గుండెలో అదోమాదిరి నింపెయ్యకే సుధామధురి
|ఆమె|
నా కళ్ళలో కళల పందిరి అల్లెయ్యకోయా మహాపోకిరి
|అతడు|
మబ్బుల్లో దాగుందీ తనవైపే లాగిందీ
|ఆమె|
సిగ్గల్లె తాకిందీ బుగ్గల్లో దాగుందీ |తుంటరి||
.
||చ|| |ఆమె|
ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
|అతడు|
మెరుపునీ తొలిచినుకునీ కలగలిపి చూడాలని
ఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియని
|ఆమె|
ఎన్నాళ్ళిలా తనొస్తాడనీ చుడాలట ప్రతీదారిని
|అతడు|
ఏతోటలో తనుందోనని ఎటు పంపనూ నా మనసునీ
|ఆమె|
ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
|అతడు|
అవునన్నా కాదన్నా గుండెలకూ కుదురుందా ||తుంటరి||
|పాప|
అక్కడ అక్కడ అక్కడ ఉందా తారక
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగక
Highlights
Brilliant lyrics to depict the physical distance, losing oneself somewhere in the dreams and the imaginative expressions
………………………………………………………………………………………………..
4 Responses to “మురారి: ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక”
దోబూచే చాలమ్మా should be
దొబూచీ చాలమ్మ
గోదారి ఉప్పొంగులు i think (pls confirm) should be
గోదారిలో వరదలు
What a song!
అసలు ఒక అబ్బాయి ఊహా సుందరిని ఎలా ఊహించాలో, అలాగె ఒక అమ్మాయి తన “గ్రీకు వీరుడిని” ఎలా ఊహించాలో, ఒక ఫొర్మాట్ తయారు చేసినట్టు పాట రాశారు.
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world
March 18th, 2009 at 3:56 am
Very good song.Thank you for sharing.
November 23rd, 2010 at 12:01 am
దోబూచే చాలమ్మా should be
దొబూచీ చాలమ్మ
గోదారి ఉప్పొంగులు i think (pls confirm) should be
గోదారిలో వరదలు
What a song!
అసలు ఒక అబ్బాయి ఊహా సుందరిని ఎలా ఊహించాలో, అలాగె ఒక అమ్మాయి తన “గ్రీకు వీరుడిని” ఎలా ఊహించాలో, ఒక ఫొర్మాట్ తయారు చేసినట్టు పాట రాశారు.
జై హొ గురుజి
November 30th, 2010 at 8:54 pm
Yes Harsha, it is దోబూచీ చాలమ్మా and గోదారిలో వరదలు as mentioned by you…
December 23rd, 2010 at 3:07 pm
Sri Harsha & Sivakanth:
Thank you for the fixes.