స్వర్ణ కమలం: ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Swarna Kamalam
Song Singers
   S. Janaki
Music Director
   Ilaya Raja
Year Released
   1988
Actors
   Venkatesh,
   Bhanu Priya
Director
   K. Viswanath
Producer
   C.H.V. Appa Rao

Context

Song Context:
             ప్రతి మనిషి అందమైన ఆశ! (Human wish!)
            

Song Lyrics

||ప|| |ఆమె|
       ఆకాశంలో ఆశల హరివిల్లు
       ఆనందాలే పూసిన పొదరిల్లు
       అందమైన ఆ లోకం అందుకోనా
       ఆదమరచి కలకాలం ఉండిపోనా
                         || ఆకాశంలో ||
.
||చ|| |ఆమె|
       మబ్బుల్లో తుళ్ళు తున్న మెరుపైపోనా
       వయ్యారి వానజల్లై దిగిరానా
       సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
       సందెల్లో రంగులెన్నో చిలికేనా
       పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా
       నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా
                         || ఆకాశంలో ||
.
||చ|| |ఆమె|
       స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
       స్వప్నాల సాగరాల సంగీతం
       ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
       ముత్యాల తోరణాల ముఖద్వారం
       శొభలీనే సోయగాన చందమామ మందిరాన
       నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా
                         || ఆకాశంలో ||
.
.
            (Contributed by Nagarjuna)

Highlights

A beautiful description of the beautiful human wish!
Sirivennela at his universalization best!

.
[Also refer to Pages 53 & 61-63 in సిరివెన్నెల తరంగాలు]
…………………………………………………………………………………………………

2 Responses to “స్వర్ణ కమలం: ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు”

  1. Sri Harsha Says:

    Hi,

    ఈ సినిమాలో “కొలువై ఉన్నాడే దేవదేవుడు..” పాట గురువు గారు రాయలేదా? ఇక్కడ ఎందుకు లేదు?

    Also, there are a few issues with the search functionality and the links on this website. Can someone contact me so that I can give more details on this?

    Regards,
    Sri Harsha.

  2. admin Says:

    Sriharsha garu,
    As far as we know, కొలువై ఉన్నాడే దేవదేవుడు.. is not written by Guruji!

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)