|
Context
Song Context:
Looks like this person has realized!
(కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ?) |
Song Lyrics
||ప|| |అతడు|
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ
మెత్తగా రేకు విచ్చెనా ||2||
కొమ్మచాటునున్న కన్నె మల్లికి || 2 ||
||కొత్తగా ||
.
||చ|| |అతడు|
కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు
|అతడు| కొండదారి మార్చింది |ఆమె| కొంటెవాగు జోరు
|అతడు| కులుకులెన్నో నేర్చింది |ఆమె| కలికి ఏటి నీరు
|అతడు|
బండరాల హోరు మారి పంట చేల పాటలూరి
|ఆమె|
బండరాల హోరు మారి పంట చేల పాటలూరి
|అతడు|
మేఘాల రాగాల మాగాణి ఊగేలా
సిరి చిందులేసింది కనువిందు చేసింది
||కొత్తగా ||
.
||చ|| |ఆమె|
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది మధురగాన కేళి
.
|అతడు| వెదురులోకి ఒదిగింది |ఆమె| కుదురులేని గాలి
|అతడు| ఎదురులేక ఎదిగింది |ఆమె| మధురగాన కేళి
|అతడు|
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
|ఆమె|
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
|అతడు|
యమునా తరంగాల కమనీయ శృంగార
కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది
|| కొత్తగా ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Sirivennela at his vintage best!
.
For example let us take a look at this relation (expression):
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి:
1) Unstructured air when it is blown into flute, it creates music.
2) This unstructured girl became structured!
3) Observe rhyme in the words of that complete relation!
Isn’t it an example of Sirivennela’s unique creative magic?
.
కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు
బండరాల హోరు మారి పంట చేల పాటలూరి
బండరాల హోరు మారి పంట చేల పాటలూరి
మేఘాల రాగాల మాగాణి ఊగేలా
సిరి చిందులేసింది కనువిందు చేసింది
The same meaning of “వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి” is presented here also with a different example but in a “complete process” ever so beautifully!
.
[Also refer to Pages 58 & 61-63 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)