|
Context
Song Context:
She is a talented dancer, but naive, unstructured & bitten by modernization!
He is an artist/painter, poetic/traditional and mature!
Rest is Sirivennela conceptualization of the debate between them in duet form! |
Song Lyrics
||ప|| |అతడు|
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్లమబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు || 2 ||
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
.
|ఆమె|
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు ||2||
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్లు
||ఘల్లు ఘల్లు||
.
||చ|| |అతడు|
లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయానిల గతిలో సుమబాలగ తూగాలి
|ఆమె|
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
|అతడు|
తిరిగే కాలానికి ||2|| తీరొకటుంది
|ఆమె|
అది నీ పాఠానికి దొరకను అంది
|అతడు|
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకు పడు సురగంగకు విలువేముంది… విలువేముంది?
||ఘల్లు ఘల్లు||
.
||చ|| |ఆమె|
దూకే అలలకు ఏ తాళం వేస్తారు
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
|అతడు|
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్థం
|ఆమె|
వద్దని ఆపలేరు ||2|| ఉరికే ఊహనీ
|అతడు|
హద్దులు దాటరాదు ఆశల వాహిని
|ఆమె|
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరివనముల పరిమళముల విలువేముంది… విలువేముంది
|| ఘల్లు ఘల్లు ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Sirivennela at his vintage best!
.
|అతడు|
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్లమబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
(Let the earth blossom with rain drops!)
.
|ఆమె|
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్లు
(Let thoughts fly and speed away with no bounds, to reach (your dreams) !
.
|అతడు|
లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయానిల గతిలో సుమబాలగ తూగాలి
(Let, you, achieve the highest in dance!)
.
|ఆమె|
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
Who can stop me from reaching my dreams!
.
|అతడు|
తిరిగే కాలానికి ||2|| తీరొకటుంది
(There is a structure to everything!)
.
|ఆమె|
అది నీ పాఠానికి దొరకను అంది
Stop your lessons!
.
|అతడు|
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకు పడు సురగంగకు విలువేముంది… విలువేముంది?
(Let your devine talents shine in glory!)
.
|ఆమె|
దూకే అలలకు ఏ తాళం వేస్తారు
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
(Who can stop me reaching my dreams!)
.
|అతడు|
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్థం
(Don’t let your life/talent melt in dreams!)
.
|ఆమె|
వద్దని ఆపలేరు ||2|| ఉరికే ఊహనీ
(Who can stop me reaching my dreams!)
.
|అతడు|
హద్దులు దాటరాదు ఆశల వాహిని
(Don’t let your thoughts cross the bounds!)
.
|ఆమె|
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరివనముల పరిమళముల విలువేముంది… విలువేముంది
(What is the value for the gardens/forests, if there is no spring!)
.
[On a side note, also observe Vishwanath gari picturization - While he sings she is in traditional dance dress where as she is in modern dress while she sings.]
.
Also Compare this song with: స్వర్ణ కమలం: శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వ with absolutely the same context.
.
[Also refer to Pages 54-55 & 61-63 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
September 20th, 2010 at 10:47 pm
గురువు గారు ఒక సారి కష్టమనిపించిన పాటలేవి అని అడిగితే, కష్టం కాదు కానీ, క్లిష్టమైనవి స్వర్ణ కమలం పాటలు అన్నారు.
ఎందుకంటే, మూడు పాటలలొ అమ్మాయి అలొచనలు మారవు. ఒకటే అలొచనతో ఉన్న అమ్మాయి భావాలని మూడు వేరు వేరు పాటలలో రాయగలగటం అంత సులభం కాదు అని.
ఐతే, రాజే తలుచుకుంటే దెబ్బలకి కొదువా అని… గురువు గారికి కష్టం ఎంటి?
Regards,
Sri Harsha.