|
Context
Song Context:
She is a talented dancer, but naive, unstructured & bitten by modernization!
He is an artist/painter, poetic/traditional and mature!
Rest is Sirivennela conceptualization of the debate between them in duet form! |
Song Lyrics
||ప|| |అతడు|
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వ ||2|| |ఖోరస్| సిరిసిరిమువ్వ ||2||
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా |ఖోరస్| సిరిసిరిమువ్వ ||2||
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా |ఖోరస్| సిరిసిరిమువ్వ ||2||
నటనాంజలితో బ్రతుకును తరించనీవా |ఖోరస్| సిరిసిరిమువ్వ ||2||
.
|ఆమె|
పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించిరావా
|| పరుగాపక ||
.
||చ|| |అతడు|
పడమర పడగలపై మెరిసే తారలకై ||2||
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై ||2||
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ ||2||
నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ
|| శివపూజకు ||
.
||చ|| |ఆమె|
తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా
|| పరుగాపక ||
.
||చ|| |అతడు|
చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం ||2||
గగన సరసి హృదయంలో
వికసిత శతదళ శోభన సువర్ణ కమలం
|| పరుగాపక ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Sirivennela at his vintage best!
.
శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
(Your are born with the devine talents so dedicate your life to make it fruitful!)
.
|ఆమె|
పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా,మది కోరిన మధుసీమలు వరించిరావా
(Let my thoughts fly without stopping.
By crossing all the hurdles, I will make my dreams a reality.)
.
|అతడు|
పడమర పడగలపై మెరిసే తారలకై, రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై, ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ,
నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ
(Don’t let your devine talents go waste, by running after meaningless things.)
.
|ఆమె|
తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా, ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా, ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా
(I won’t let my roots keep me tied but will achieve my ambitions!)
.
|అతడు|
చలిత చరణ జనితం నీ సహజ విలాసం, జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం, గగన సరసి హృదయంలో
వికసిత శతదళ శోభన సువర్ణ కమలం
(Your natural talent & beautiful skills, let your performance be watched by the eye of the SUN to become a golden lotus (సువర్ణ కమలం) in the skies forever!)
.
Also Compare this song with: స్వర్ణ కమలం: ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు with absolutely the same context.
.
[On a side note, also observe Vishwanath gari picturization - While he sings she is in traditional dance dress where as she is in modern dress while she sings.]
.
[Also refer to Pages 56-57 & 61-63 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
September 20th, 2010 at 10:55 pm
శివ పూజకు చిగురించిన సిరిసిరిమువ్వ, ఝల్లు ఝల్లు - ఈ రెండు పాటలలో ఒక చిన్న విషయం ఉంది. సినిమాలో హీరొ పాత్ర కళాకారుడిది కావటం, హీరొఇన్ పాత్ర సాధరణమైన అమ్మాయిది కావటం వల్ల గురువు గారు అబ్బాయి పదాలు కవిత్వానివి అమ్మాయి పదాలు దైనందికమైనవి వాడారు.
ఆ రెండిటి కలయిక ఎంత అద్భుతంగా ఉందో అందరికీ కనబడుతోంది.
Regards,
Sri Harsha.
September 21st, 2010 at 2:39 am
ఈ పాట లో చరణం లో
” పడమర పడగల పై మెరిసే తారల కై రాత్రి ని వరించకే సంధ్యా సుందరి “అని ఉంటుంది
అమ్మాయి ని సంధ్యా సమయం (morning time or evening time )తో పోలుస్తూ
పాశ్చాత్య దేశాల పోకడలను నక్షత్రాల తో సరి చూపుతూ
ఆ ఆకర్షణ కి లోనైతే జీవితాన్ని చీకటి చేసుకుంటావు సుమా!!!!!!! అని ఎంతొ చక్కగా చెప్పారు
పడమర పడగలు అనడం లో పాశ్చాత్య సంస్కృతి ని ఒక విష సర్పం తో పోల్చి,
ఆ పడగల పై ఉన్న మెరిసే మణుల కోసం వెళ్ళవద్దు అని కూడా అన్నారేమో అనిపిస్తుంది
అదే సంధ్య వేకువ సమయాన వెలుగులు చిమ్ముతూ తన తో పాటు లోకానికి కూడా వెలుగు ను ఇస్తుంది
మూవీ లో సందర్భాన్ని బట్టి మన కళ లకి విలువ ఇమ్మని సున్నితం గా చెప్పారు
ఎంతొ అందం గా అద్భుతం గా కూడా !!!!!!!!!