|
Context
Song Context:
I. అందెల రవమిది.
1) పదములదా? (mere mechanical)
2) అంబరమంటిన హృదయముదా?
II. అమృతగానమిది.
1) పెదవులదా? (mere mechanical)
2) అమితానందపు యదసడిదా?
She has realized it now, deeply heartfelt, and absolutely ecstatic!
(Just relax & enjoy the show) |
Song Lyrics
||శ్లోకం||
గురు బ్రహ్మ గురు విష్ణుః గురుద్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ||2||
తస్మై శ్రీ గురవే నమః
|అతడు|
ఓం నమో నమో నమశ్శివాయ
|ఆమె|
మంగళ ప్రదాయ గోపురంగతే నమశ్శివాయ
గంగయాతరింగితోత్తమాంగతే నమశ్శివాయ
|అతడు|
ఓం నమో నమో నమశ్శివాయ
|ఆమె|
శూలినే నమో నమః కపాలినే నమశ్శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమశ్శివాయ
.
||ప|| |ఆమె|
అందెల రవమిది పదములదా ||2||
అంబరమంటిన హృదయముదా ||అందెల||
అమృతగానమిది పెదవులదా
అమితానందపు ఎదసడిదా
|అతడు|
సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా ||2||
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా
||అందెల||
.
||చ|| |ఆమె|
మువ్వలు ఉరుముల సవ్వడులై - మెలికలు మెరుపుల మెలకువలై ||2||
మేను హర్షవర్ష మేఘమై - మేని విసురు వాయువేగమై
|అతడు|
అంగభంగిమలు గంగపొంగులై హావభావములు నింగిరంగులై
లాస్యం సాగే లీల… రసఝరులు జాలువారేలా
|ఆమె|
జంగమమై జడమాడదా
|అతడు|
జలపాత గీతముల తోడుగా
|ఇద్దరు|
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
||అందెల||
.
||చ|| |అతడు|
నయనతేజమే “న” కారమై
మనోనిశ్చయం “మ”కారమై
శ్వాసచలనమే “శి”కారమై
వాంచితార్థమే “వ”కారమై
యోచన సకలము “య”కారమై
నాదం “న”కారం, మంత్రం “మ”కారం
స్తోత్రం “శి”కారం, వేదం “వ”కారం
యజ్ఞం “య”కారం, ఓం నమఃశివాయ
.
|ఆమె|
భావమే భవునకు భావ్యము కాదా
భరతమే నిరతము భాగ్యము కాదా
|అతడు|
తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ
|ఆమె|
ప్రాణపంచమమే పంచాక్షరిగా పరమపదము ప్రకటించదా
|అతడు|
ఖగోళాలు పదకింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటిరేగా
|| అందెల ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
1988 Nandi Award Winner!
.
.
A Sirivennela Classic!
.
She has realized it now, deeply heartfelt, and absolutely ecstatic!
Rest is all Sirivennela gari poetry for her performance!
.
[Also refer to Pages 59 - 63 in సిరివెన్నెల తరంగాలు & pages 5-7 in "నంది" వర్ధనాలు]
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
September 22nd, 2010 at 11:11 pm
Beautiful song !!
గురు బ్రహ్మ గురు విష్ణుః గురుద్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ||2||
తస్మై శ్రీ గురవే నమః
ఓం నమో నమో నమశ్శివాయ
మంగళ ప్రదాయ గోపురంగతే నమశ్శివాయ
గంగయాతరింగితోత్తమాంగతే నమశ్శివాయ
ఓం నమో నమో నమశ్శివాయ
శూలినే నమో నమః కపాలినే నమశ్శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమశ్శివాయ
ఈ part ఎందుకో lyrics లో add చెయ్య లెదు
అలాగే పాట చివరిలో
ప్రాణ మంచమమే పంచాక్షరి గా పరమ పదము ప్రకటించదా……(ప్రకటించగా కాదు )
అని ఉంటుంది
September 23rd, 2010 at 10:00 am
Bhavani garu,
Thanks for the contribution. Added with the correction now.
November 27th, 2010 at 9:42 pm
Great Song. You cannot get a better combination that Satry Garu - Ilaiyaraja and S P Balasubramanyam.