అల్లరి: అత్తయ్యో మావయ్యో అంతా రారండయ్యో

Posted by admin on 19th March 2010 in ఆస్తుల వాటాల పోటీలు

Audio Song:
 
Movie Name
   Allari
Song Singers
   Mano,
   Grace
Music Director
   J. Paul
Year Released
   2002
Actors
   Allari Naresh,
   Swetha Agarwal
Director
   Ravi Babu
Producer
   Ravi Babu

Context

Song Context:
   వాటాల పోటీలు వదిలెయ్రాదా కొంతా!
   ఎంతో బాగుణ్ణు ఇల్లాగా కలిసుంటే అంతా

Song Lyrics

||ప|| |అతడు|
       అత్తయ్యో మావయ్యో అంతా రారండయ్యో
       అక్కయ్యో బావయ్యో వింతే చూడండయ్యో
|ఆమె|
       కోపంలో కొంపల్లో ముడుచుకు పోకండయ్యో
       నూతుల్లో కప్పల్లా ఎన్నాళ్లుంటారయ్యో
|అతడు|
       మన గుమ్మంలో హరివిల్లే సిద్ధంగా ఉందయ్యో
       ఆ రంగులు చూద్దాం హంగామా చేద్దాం
|ఆమె|
       నడి సమ్మర్లో చినుకల్లే నవ్వే కురిసిందయ్యో
       ఆ జల్లులు చూద్దాం స్నానాలే చేద్దాం
|అతడు|
       ఇదిగో ఆడ మగా అంతా ఈ అల్లర్లో చేరొచ్చండి
|ఆమె|
       ముసలీ ముతకయినా పసి పాపల్లా మారొచ్చండి
                                        ||అత్తయ్యో||
.
||చ|| |ఆమె|
       ఎంతో కాలం నుంచి రాని పండుగల్లే ఉందీ ఇది
|అతడు|
       ఎంతో దూరం నుంచి వచ్చే బంధువల్లే అందరికీ ఆనందం ఇస్తున్నది
|ఆమె|
       ఎంతో బాగుణ్ణు ఇల్లాగా కలిసుంటే అంతా
|అతడు|
       అనుకుంటాం కానీ ప్రతి రోజూ ఇట్టా ఉంటుందా
|ఆమె|
       వాటాల పోటీలు వదిలెయ్రాదా కొంతా
       వండర్ లా అయిపోదాం మన ఈ కాంప్లెక్ష్ అంతా
                                        || అత్తయ్యో ||
.
||చ|| |అతడు|
       గురువా నా విన్నపాలు ఒక్కటైనా వినవా
       మెదడే కొరికి తినే చెద పురుగవుతావా
|ఆమె|
       ఒక చెట్టునే పిట్టలన్ని గూళ్లు కట్టుకోవా
       మనలా ప్రతి క్షణం తన్నుకుని ఛస్తున్నాయా
|అతడు|
       సొంతిల్లే అయినా అపార్ట్మెంట్ లైఫ్ అంటే
       కుదరదు అడ్జస్ట్ అవ్వందే
|ఆమె|
       పేచీ పెడితే ఇరుగు పొరుగు ఎపుడైనా
       రాజీ పడవలసిందే
|అతడు|
       ఫ్రెండ్లీ గా ఫ్యామిలీగా గడిపేసే కిటుకుంది
|ఆమె|
       అది మనం మనం బలంపురం అనుకుంటూ హాపీగా బ్రతకడమే
|అతడు|
       ఆటల్లో పాటల్లో విడిగా ఉండద్దయ్యో
       అందర్లో ఒకరైతే మన పరువేం పోదయ్యో
                                         ||అత్తయ్యో||
.
||చ|| |ఆమె|
       మన ముంగిట్లో ముగ్గల్లే స్నేహం చిత్రించండి
       ప్రతి పూటా మనకి సంక్రాంతేనండి
|అతడు|
       ఈ వాదాలు భేదాలు కాసేపే అనుకోండి
       ఈ చిటపటలన్నీ దీవాళీలండి
|ఆమె|
       నిద్దర్లే వదిలి ఈ సందడికెదురెళ్లాలంటా
|అతడు|
       హద్దుల్నే చెరిపి సరదాగా చెలరేగాలంటా
       రండయ్యో రండయ్యో పిల్లా పెద్దా అంతా
       అహ ఉండయ్యొ వినవయ్యో విన్నపాల చింత
                                       || అత్తయ్యో||
.
.
                (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)