|
Context
Song Context:
తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ
అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమా నీ దారికీ! |
Song Lyrics
||ప|| |అతడు|
నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ
అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమా నీ దారికీ
.
||చ|| |అతడు|
కలతలే కోవెలై కొలువయే విలయమా
వలపులో నరకమే వరమనే విరహమా
తాపమే దీపమా వేదనే వేదమా
శాపమే దీవెనా నీకిదే న్యాయమా
కన్నీరభిషేకమా నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా ప్రణయమా
|| నువ్వు ఎవ్వరి ||
.
||చ|| |అతడు|
రెప్పలే దాటదే ఎప్పుడూ ఏ కలా
నింగినే తాకదే కడలిలో ఏ అలా
నేలపై నిలవదే మెరుపులో మిల మిలా
కాంతిలా కనపడే భ్రాంతి ఈ వెన్నెలా
అరణ్యాల మార్గమా అసత్యాల గమ్యమా
నీతో పయనమే పాపమా ప్రణయమా
|| నువ్వు ఎవ్వరి ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)