మల్లీశ్వరి: నీ నవ్వులే వెన్నెలనీ మల్లెలనీ హరివిల్లులనీ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Malliswari
Song Singers
   Kumar Sanu,
   Sunitha
Music Director
   Koti
Year Released
   2004
Actors
   Venkatesh,
   Katrina Kaif
Director
   K. Vijaya Bahskar
Producer
   D. Rama Naidu

Context

Song Context:
    నీ నవ్వులే వెన్నెలనీ మల్లెలనీ హరివిల్లులనీ!

Song Lyrics

||ప|| |అతడు|
       నీ నవ్వులే వెన్నెలనీ మల్లెలనీ హరివిల్లులనీ
       ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవనీ
.
||చ|| |అతడు|
       బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి
       మందారం మురిసిపోదా నీ సిగలో పూసి
       వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాలబొమ్మని చేసి
       అణువణువు వెండి వెన్నెల పూసి
       విరితేనెతోనే ప్రాణం పోసి
       ఆ బ్రహ్మ నిన్ను మళ్లీ మళ్లీ చూసి తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి
                                     ||ఎవరేవేవో ||
.
||చ|| |అతడు|
       పగలంతా వెంటపడినా చూడవు నా వైపు
       రాత్రంతా కొంటెకలవై వదలవు కాసేపు
       ప్రతి చోట నువ్వే ఎదురొస్తావు ఎటు వెళ్లలేని వల వేస్తావు
       చిరునవ్వుతోనే ఉరివేస్తావు నన్నెందుకు ఇంత ఊరిస్తావు
       ఒప్పుకోవే నువ్వు చేసిందంతా చేసి
       తప్పు నాదంటావా నానా నిందలేసి
.
.
                (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)