మల్లీశ్వరి: గుండెల్లో గులాబీల ముళ్లు నాటిందే నిగారాల ఒళ్లు

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Malliswari
Song Singers
   Sankar Mahadevan,
   Chitra
Music Director
   Koti
Year Released
   2004
Actors
   Venkatesh,
   Katrina Kaif
Director
   K. Vijaya Bahskar
Producer
   D. Rama Naidu

Context

Song Context:
    మతి చెదరద ఎదురుగ కనపడితే మల్లీశ్వరి!

Song Lyrics

||ప|| |అతడు|
       గుండెల్లో గులాబీల ముళ్లు
       నాటిందే నిగారాల ఒళ్లు
       నన్ను మాయ చేయకే నెరజాణ
|ఆమె|
       అయ్యయ్యో ఇలా రాకు వెళ్లు
       ఒంపుల్లో ఇరుక్కుంటే కళ్లు
       నిన్ను లాగలేనుగా నేనైనా
|అతడు|
       తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా
|ఆమె|
       మరీ బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా
|అతడు|
       అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి
       మతి చెదరద ఎదురుగ కనపడితే మల్లీశ్వరి
                          |ఆమె| ||అయ్యయ్యో||
.
||చ|| |అతడు|
       అగ్గి లాంటి నీ అందాలు
       రగిలించగానే ఈ చన్నీళ్లు
       ఆవిరావిరై పోతాయే సౌందర్యమా
|ఆమె|
       సిగ్గు దాటి నీ ఆత్రాలు
       సొగసల్లుతుంటే సుకుమారాలు
       అల్లరల్లరై పోతాయే శృంగారమా
|అతడు|
       నిందించి తప్పించుకోకమ్మా
       కను విందిచ్చి కవ్వించుకోకమ్మా
|ఆమె|
       నువ్వంత తెగించి రాకమ్మా పోమ్మా
|అతడు|
       అది చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి
       మతి చెదరద ఎదురుగ కనపడితే మల్లీశ్వరి
                                  ||అయ్యయ్యో ||
.
||చ|| |ఆమె|
       కాగడాలు అనిపించేలా నీ ఆగడాలు వెలిగించాలా
       ఎక్కడెక్కడేమున్నాయో గాలించగా
|అతడు|
       స్వాగతాలు వినిపించేలా నీ సోయగాలు శృతి మించాలా
       హెచ్చు తగ్గులెన్నున్నాయో వివరించగా
|ఆమె|
       చురుక్కు చురుక్కుమనేలా నన్ను కొరుక్కు కొరుక్కు తినాలా
|అతడు|
       వయస్సు సమస్య తీరేలా రమ్మా
|అతడు|
       అది చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి
       మతి చెదరద ఎదురుగ కనపడితే మల్లీశ్వరి
                                   ||అయ్యయ్యో ||
.
.
                (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

2 Responses to “మల్లీశ్వరి: గుండెల్లో గులాబీల ముళ్లు నాటిందే నిగారాల ఒళ్లు”

  1. Sri Harsha Kiran Says:

    “అది చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి” - I think it is అతి and not అది.

    Could you please check?

  2. admin Says:

    You are right. Fixed it.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)