Posted by admin on 7th May 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |ఆమె|
చెమ్మచెక్క ఘుమ్మంది మల్లెమొగ్గ
జున్నుముక్క తెచ్చింది పిల్ల బుగ్గ
|ఆమె1|
చెమ్మచెక్క ఘుమ్మంది మల్లెమొగ్గ
తిమ్మిరెక్క కాటేయి కందిరీగ
|ఆమె|
జున్నుముక్క తెచ్చింది పిల్ల బుగ్గ
|ఆమె1|
పంటనొక్క లేటేంది రెచ్చిపోక
అతడు:
ఇటు చూస్తే వన్నెల చిలక
అటు చూస్తే వెన్నెల తునక
అడుగైతే ఆగదు సాగదు ఆ వంకొ ఈ వంకొ ఏం దారికా
||చెమ్మ చెక్క||
.
||చ|| |ఆమె|
వెనకేశా ఈడు ఇన్నినాళ్ళుగా వదిలేశా నేడు ఇంత వీలుగా
అతడు:
మునకేశా వేడి చూపు దాడిగా గుటకేశా చూడు ఊపిరాడక
ఆమె1:
కట్టూ బొట్టూ గుప్పెడు మూసేదాక ఇంత గొప్ప సంపద చూడలేదా
అతడు:
గుట్టూ బెట్టూ కట్టడి లేనేలేక గుర్తుపట్టలేదే ఇప్పటిదాక
ఆమె:
ఎరవేసా ఎదురవకుండా ఎగరేసా నిగనిగ జెండా
అతడు:
తెరలేసి తలుపులు తీసి నా తిక్క పెంచొద్దె చెలగాటంగా
||చెమ్మ చెక్క||
.
||చ|| |అతడు|
పరమేశా ఎంత జాలి గుండెరా ఉరివేసే రెండు పూల దండలా
ఆమె:
ప్రాణేశా పక్కచూపులేంటలా గిరిగీశా దాటి వెళ్ళిపోకలా
అతడు:
చిక్కులు పెట్టే చక్కని చుక్కల్లారా చక్కిలిగింతలు పెట్టే చంపేస్తారా
ఆమె1:
అవ్వా బువ్వా కావాలా గోపాలా ఇస్తూ ఉంటే కెవ్వున రాగాలేలా
అతడు:
ఒకతేమో బూరెల బుట్ట ఒకతేమో గారెల గుట్ట
ఏం వదలాలన్నా ప్రాణం అల్లాడి పోతోందే ఏం తోచక
||చెమ్మ చెక్క||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)