Posted by admin on 7th May 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song!
|
Song Lyrics
||ప|| |అతడు|
కోణంగి కోణంగి కోణంగీ నీ కోకేదే రైకేదే కోణంగీ
సారంగి సారంగి సారంగీ నీ సిగ్గంత ఏమైంది సారంగీ ||కోణంగి||
రా.. నీ చెకుముకు చమకులు చెరుకుకి చెమటలు ఏలా
వామ్మో.. మా యువకుల ఎముకలు కొరికితినే జవరాలా
ఉలిపిరి పరదా కలవర పడదా కులుకుల మీద కుదరదె ఆదా
పెరిగే బరువా మరుగే కరువా పరువే చెడిపోదా
||కోణంగి||
.
చరణం: అతడు:
నరమిట్టా నమిలేసే నెరజాణ కునుకంతా కొరికేసే కురదాన
ఆమె:
ఎరవేస్తే దొరికేనా సొరమేన పొగిడేస్తే పడిపోయే పసిదాన్నా
అతడు:
మహానుభావులైనా నీ నిగారమెదురైతే
దిగాలుపడరనుకో మరి అదేమి మగ పుటకో
ఆమె:
బడాయి డాబులెందుకో నువు సిపాయివే అనుకో
లడాయి చూపులెందుకో ఈ తుపాకి పేలదనుకో
అతడు:
చలికీ చిలికీ జడివానయ్యే జగడాలా బాలా
||కోణంగి||
.
చరణం: కోరస్:
ఓ జులాయి అబ్బాయా నే కోరింది ఇస్తావా
నువు సయ్యంటె సయ్యంటా నీ సరదా తీరుస్తా
ఓ సిపాయి చిన్నయ్యా ఇది పాపాయి కాదయ్యా
నీకు సీనంత లేదయ్యా పని చూసుకు పోవయ్యా
ఆమె:
పనులన్నీ ఎగవేసే పరుగేలా సొగసంతా తెగ చూసే చొరవేలా
అతడు:
పదుగుర్ని జమచేసే తిరుణాలా సరుకంతా టముకేస్తూ తిరగాలా
ఆమె:
చిటుక్కు చిమ చిమలో మతి వెతుక్కు తేగలవా
చమక్కు జాతరలో ఇక వెనక్కి రాగలవా
అతడు:
పుటుక్కు జరజరలో నువు డుబుక్కు మే అనవా
సురుక్కు వరదలలో పడి బుడుంగుమనిపోవా
ఆమె:
చినుకే పడని పొడికేకలతో అతిగా ఉరమాలా… హే పోవయ్య
||కోణంగి||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)