|
Context
Song Context:
అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా |
Song Lyrics
||ప|| |అతడు|
అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా
|ఆమె|
అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా
|| అసలేం ||
.
||చ|| |ఆమె|
గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకు పచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమమై… ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల
||అసలేం ||
.
||చ|| |ఆమె|
కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ
చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజుల హాహాకారం
మళ్లీ మళ్లీ…. మళ్లీ మళ్లీ ఈ రోజు రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం
||అసలేం ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)