శ్రీ ఆంజనేయం: పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా

Posted by admin on 20th March 2009 in టీజింగ్ సాంగ్

Audio Song:
 
Movie Name
   Sri Anjaneyam
Singers
   Shriya Ghoshal
Music Director
   Mani Sharma
Year Released
   2004
Actors
   Nitin, Charmee
Director
   Krishna Vamsi
Producer
   Krishna Vamsi

Context

Song Context: A teasing love song by a girl.

Song Lyrics

||ప|| |ఆమె|
       పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
       తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
       ప్రేమంటే పామని బెదరాలా
       ధీమాగా తిరగరా మగరాయడా
       భామంటే చూడని వ్రతమేలా
       పంతాలు చాలురా ప్రవరాఖ్యుడా
       మారనే మారవా మారమే మానవా
       మౌనివా మానువా తేల్చుకో మానవా || పూల||
.
||చ||
       చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో
       దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
       మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
       నా వాలు జడ చుట్టుకొని మొగలి రేకా నడుము నడిపించుకో
       వయసులో పరవశం చూపుగా చేసుకో
       సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో || పూల||
.
||చ||
       ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై
       జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్రగన్నేరునై
       నీ గుండెపై ఒదిగుండనీ పొగడపూదండనై
       నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగలువనై
       మోజులే జాజులై మోయనీ హాయినీ
       తాపమే తుమ్మెదై…తీయనీ తేనెనీ || పూల||
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)