Movie Name Sri Anjaneyam Singers Mallikharjun Music Director Mani Sharma Year Released 2004 Actors Nitin Director Krishna Vamsi Producer Krishna Vamsi
Context
Song Context: An orphan boy conveying his gratitude to the villagers who brought him up and his worshipping God.
Song Lyrics
||ప|| |అతడు|
రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా…
అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా…
సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ
నిత్యం నీతో ఉన్నాగా..ఇద్దరి లక్షణమొకటేగా || రామ రామ||
.
||చ||
అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ
నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ || అమ్మల్లే ||
ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా
ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం
అన్నీ సొంత ఇళ్ళే అంతా అయినవాళ్ళే
ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం
బ్రతుకంతా ఇది తీరే ఋణమా || రామ రామ||
.
||చ||
ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ
ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ
ప్రసన్నాంజనేయం అనే నామధేయం
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నా వెంటే నువ్వుంటే భయమా… || రామ రామ ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
One of the simplest songs with sweetest words to express gratitude in the given context. తన God ఆంజనేయుడితో: “ఇద్దరిది కోతి లక్షణమే”, “ఇద్దరము గాలికే పుట్టాము” tickling lyrics! Observe the positive spirit in చరణం2
………………………………………………………………………………………………..
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world