| 
 | 
 Context 
Song Context: 
    పల్లెటూరు, మనదే!  | 
 
| 
 Song Lyrics 
||ప|| |అతడు| 
       కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే 
       చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే 
       మీది నుంచి సూదులొచ్చి చురుక్కు చురుక్కు చురుక్కు పొడిచే 
       ఎల్లయ్యో మల్లయ్యో కళ్లు తెరిచి చూడండయ్యో 
       రామయ్యో కృష్ణయ్యో అల్లరల్లరి చేయండయ్యో 
       ఊరుకుంటే ఊరు కాస్తా ఉషారు తెలీక ఉసూరుమంటది 
                                     ||కొక్కొరొకో|| 
. 
||చ|| |అతడు| 
       సెటప్పులుంటవి సిగ్గు పడతవి తప్పుకోరా 
       అవస్థ పడతవి వద్దు మనకవి తప్పు కదరా 
       ఆరా తీస్తూ ఆరోగ్యం చెడిపోతే కష్టం 
       ఎక్కడి దొంగలు అక్కడనే గుప్ చుప్ అనుకుందాం 
       అటు చూస్తూ చిటికేస్తూ నువ్ ఎరక్క ఇరక్కురా 
                                    ||కొక్కొరొకో|| 
. 
|||చ|| |అతడు| 
       ఒక్కొక్క కడవకి ఒక్క తడవకి ఒక్క రాయే 
       సరిగ్గ తగలక తప్పు జరిగితే తెగ లడాయే 
       బాగా ప్రాక్టీస్ ఉంటేనే వేళాకోళం చెయ్ 
       చాలా ఈజీ అనుకుంటే బోల్తా పడతవురోయ్ 
       ఎర వేస్తే గురి చూస్తే మరి వెనక్కు తిరక్కురో 
                                     ||కొక్కొరొకో|| 
. 
. 
             (Contributed by Nagarjuna)  | 
 
| 
 Highlights 
………………………………………………………………………………………………… 
 | 
 
 
 | 
					
				 
				  
		
	
			
	 
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)