| 
|  | Context Song Context:ఫిల్మ్ ప్రోగ్రాం ఏ రోజు?
 Interesting discussion by lovers!
 |  
| Song Lyrics ||ప|| |అతడు|సండే మండే వదిలేయ్ నేను బిజీ మై రోజీ
 ట్యూజ్ డే ఫిల్మ్ ప్రోగ్రాం ఈ రోజే ఫిక్స్ చేద్దాం
 ఆమె:
 ట్యూస్ డే వెరీ సారీ హాలిడే డాడీకి
 వెడ్స్ డే కి మన ప్రొగ్రాం మారిస్తే నో ప్రాబ్లం
 అతడు:
 నాకు వీలైనదే నీకు జైలైనదే
 ఆమె:
 నాకు వీలెప్పుడో నీకు పనులప్పుడే
 అతడు:
 అయితే మరేం చేద్దాం నీతో మహాకష్టం
 ఆమె:
 రానన్నానా బుధవారం కాదన్నానా నీ ఇష్టం
 .
 చరణం: అతడు:
 ధర్సుడే మార్నింగ్ ఓకే కదా
 ఆమె:
 పొద్దున్న ఇంట్లో పనుండదా
 అతడు:
 ఆరోజు ఈవినింగ్ బాగుండదా
 ఆమె:
 బాబా గుడికి వెళ్ళాలి కదా
 ||అతడు|| |ధర్సుడే మార్నింగ్|
 అతడు:
 మర్నాడు ఐనా సరే
 ఆమె:
 మనకారోజు చుక్కెదురే
 అతడు:
 మరి ఏంకొంప మునిగిందట
 ఆమె:
 ఆ రోజు రాఖీ కదా
 అతడు:
 ఐతే మరేం చేద్దాం నీతో మహా కష్టం
 ఆమె:
 రానన్నానా బుధవారం
 ||సండే||
 .
 చరణం: ఆమె:
 శనివారం నీకు హాఫ్ డే కదా
 అతడు:
 సగం రోజుతో ఏం సరదా
 ఆమె:
 ఆదివారమంతా మనదే కదా
 అతడు:
 నో ఛాన్స్ ముందే చెప్పాకదా
 ఆమె:
 ఏముద్దరిస్తారంట
 అతడు:
 చెబితే అదో తంట
 ఆమె:
 ఏం పాడు సీక్రెట్టని
 ఆతడు:
 క్రికెట్టుమ్యాచ్ వుంది
 ఆమె:
 క్రికెట్ ని లవ్ చేసుకో నీముఖాన్ని చూడనుపో
 అతడు:
 నూరేళ్ళ లవ్ అనుక్కో వండే ఇస్తే ఏం రిస్కో
 ||సండే||
 .
 .
 (Contributed by Venkata Sreedhar)
 |  
| Highlights ………………………………………………………………………………………………… |  | 
					
				 
				  
		
	
			
	 
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)