మొదటి సినిమా: ఉరిమే మేఘం అపుడే కరిగిందా

Audio Song:
 
Movie Name
   Modati Cinema
Song Singers
   Sonu Nigam,
   Chitra
Music Director
   Swaraj
Year Released
   2005
Actors
   Navadeep,
   Poonam Bajwa
Director
   Kuchipudi Venkat
Producer
   Kunduru Ramana Reddy

Context

Song Context:
    An unbelievable love song! 

Song Lyrics

||ప|| |అతడు|
       ఉరిమే మేఘం అపుడే కరిగిందా
       జిలిబిలి స్వరముల చెలిమిని చిలికిన కలలై కురిసిందా
|ఆమె|
       తరిమే వేగం తెలిసే ఉరికిందా
       తలపులు పిలిచిన వలపిటు ఉందని ముందే చూసిందా
|అతడు|
       వర్ణాలు తెల్లబోవా చెలి చిత్రమా
|ఆమె|
       వందేళ్లు అల్లుకోవా తొలి నేస్తమా
                      ||ఉరిమే మేఘం||
.
||చ|| |అతడు|
       ఋణముంటే చెల్లించాలి రమణీమణి
       కాబట్టే ఊహించానే నీ రాకని
|ఆమె|
       ఆమాటే అంతా అంటే విన్నా కానీ
       ఈ పూటే అనిపించింది అవునా అని
|అతడు|
       ఎంత సేపు లెమ్మని నమ్మకాన్ని నమ్మనీ
|ఆమె|
       తప్పుకుంటే తప్పని ఒప్పుకున్న మనసుని
       నన్నోడించి గెలిపించనీ
                      ||ఉరిమే మేఘం||
.
||చ|| |అతడు|
       నీ రాగం మంత్రిస్తుంటే మైమరుపుగా
       నా మార్గం మళ్లించింది నీ వైపుగా
|అతడు|
       నా ప్రాణం అందిస్తుంటే మన్నించక
       నీ మౌనం ఆపిందేమో మాటాడక
|ఆమె|
       నిందలన్ని ఆనక అందుకోవ కానుక
|అతడు|
       నింగి నుంచి నేరుగా జంట చేరు తారగా
       విచ్చేసింది అభిసారిక
                       ||ఉరిమే మేఘం||
.
.
                 (Contributed by Prabha)

Highlights

Follow the depth & constructon of each line!
………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)