|
Context
Song Context:
Two intellectuals - one romantic Song!
[.... వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను] |
Song Lyrics
||ప|| |అతడు|
లలిత ప్రియకమలం విరిసినది కన్నుల కొలనిని
ఆమె:
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని || ఉదయ ||
అతడు:
అమృత కలశముగ ప్రతి నిముషం || 2 ||
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
|| లలిత ||
.
చరణం:
అతడు:
రేయీ పవలూ కలిపే సూత్రం సాంధ్యారాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
ఆమె:
నేలా నింగీ కలిపే బంధం ఇంద్రచాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
అతడు:
కలల విరుల వనం మన హృదయం || 2 ||
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
ఆమె:
కోటి తలపుల చిగురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
అతడు:
తీపి పలుకుల చిలుకల కిల కిల
తీగ సొగసుల తొణికిన మిలమిల
ఆమె:
పాడుతున్నది ఎదమురళి
రాగఝురి తరగల మృదురవళి
ఆమె:
తూగుతున్నది మరులవని
లేత విరి కులుకుల నటనగని
అతడు:
వేల మధుమాసముల పూల దరహాసముల
మనసులు మురిసెను
|| లలిత ||
.
చరణం:
ఆమె:
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
అతడు:
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజా కుసుమం
ఆమె:
మనసు హిమగిరిగ మారినది || 2 ||
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
అతడు:
మేని మలుపుల చెలువపు గమనము
వీణపలికిన జిలిబిలి గమకము
ఆమె:
కాలి మువ్వగ నిలిచెను కాలము
పూల పవనము వేసెను తాళము
అతడు:
గేయమైనది తొలిప్రాయం రాయమని మాయని మధుకావ్యం
ఆమె:
స్వాగతించెను ప్రేమపథం సాగినది ఇరువురి బ్రతుకురధం
అతడు:
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరుగిడి
|| ఉదయ||
.
.
(Contributed by Pradeep) |
Highlights
The Cine Technician Asociation of South India కళైంజర్ కరుణానిధి Award 1988 Winner!
.
Compare this song with: గాయం: అలుపన్నది ఉందా ఎగిరే అలకు & అల్లుడుగారు వచ్చారు: గుండెలో సందడి పదాలకే అందెగా
.
[Also refer to pages 209 & 41-42 in సిరివెన్నెల తరంగాలు & pages 34-37 in "నంది" వర్ధనాలు]
……………………………………………………………………………………………….. |
|
2 Comments »