|
Context
Song Context:
గుండెలో సందడి పదాలకే అందెగా యుగాలపై సాగిపోనీ నడిచే నా కలని! |
Song Lyrics
||ప|| |అతడు|
గుండెలో సందడి పదాలకే అందెగా
యుగాలపై సాగిపోనీ నడిచే నా కలని
కళ్ళలో కాంతినీ పెదాలకందివ్వగా
ప్రభాతమై నవ్వుకోనీ వెలిగే నా చెలినీ
వలపుల శృతిలో ఆమె ప్రతి అడుగు
కళలొలికించే నాట్యమైపోనీ
తన ప్రాణవాయువుగా అయ్యేటి నా ఆయువే
ప్రకటించనీ జగానికి నేనే తాననీ
.
చరణం: ఆమె:
ఊయలే ఊపనీ ఈవేళ నీ ఊహనీ
హుషారుగా అందుకోనీ దివిలో జాబిలినీ
రేపునే చూపనీ నిషాల నీ చూపునీ
ఉషస్సుగా చేరుకోనీ మెరిసే ఆశలనీ
అణువణువున నీ శ్వాసలో తడిసి
విరిసిన వయసే నందనం కానీ
మనలోని అనురాగమే స్వరాలు అందించగా
మధుగీతమై తరించనీ వీచే గాలిని
.
చరణం: అతడు:
ఓ ప్రియా ! ఓ ప్రియా ! ఇదేగా ఎదలో లయ
నువ్వేమి చేశావో మాయ - ప్రణయాలయమయా
ఆమె:
వింత ఏముందయా - ఇదంతా నీ లీలయా
వరించి పూమాల వేయా వలచా రావయా
అతడు:
విడవని జతగా జంటపడమంటూ
కలిపిన బ్రతుకే ధన్యమైపోగా
ఆమె:
మన ప్రేమ వేదికగా ఉగాదులే చేరగా
కరగని కలై మనం ఇలా ఉంటే చాలుగా
.
.
(Contributed by Prabha) |
Highlights
Wow! Yet another love song with out of the world lyrics!
.
పల్లవి in english translation below:
As the celebration in my heart become music to my path, let my dreams come true and establish another era!
As the light in my eyes gettogether with my lips, let my companion smile by awakening with glow!
Let her every step become artistic dance with romantic tunes!
As the life in my body become oxygen to her, let her tell the universe - she and I are the same!
.
Compare this song with: గాయం: అలుపన్నది ఉందా ఎగిరే అలకు & రుద్రవీణ: లలిత ప్రియకమలం విరిసినది కన్నుల కొలనిని
.
[Also refer to Pages 156-157 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
|
1 Comment »