Movie Name Murari Singers Chitra Music Director Mani Sharma Year Released 2001 Actors Sonali Bendre Director Krishna Vamsi Producer Nandigam Devi Prasad
Context
Song Context: Debating with herself to express love to him
Song Lyrics
||ప|| |ఆమె|
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పెసేయ్
అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా
అంటోంది ఓ మొహమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీ
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలదీ ||చెప్పమ్మా||
.
||చ||
వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా
కంటికి ఎదురుపడతావేంటి ఎటు చూసినా
చెంప గిల్లి పోతావే ఏంటి గాలి గిల్లుతున్నా
అంతా గొడవ పెడతావే ఏంటి నిదురోతువున్నా
అసలు నీకు ఆచొరవేంటి తెలియకడుగుతున్నా
ఒంటిగా ఉండవేంటి ఒక్క నిమిషమైనా
ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరనూ
నువ్వేం చేసినా కాదంటుందని నిజం నీకెలా చెప్పనూ ||చెప్పమ్మా||
.
||చ||
నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచ్చటైనా
ఏడిపించ బుద్ధౌతుంది ఎట్టాగైనా
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా
కాస్త కస్సు మనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపొతూవున్నా
లేనిపోని ఉక్రొషంతో ఉడుకెత్తనా
ఇదేం చూడవు మహా పోజుగా ఎటో నువ్వు చూస్తువున్నా
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్నా హయ్యో రామా ||చెప్పమ్మా||
.
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ఐ లవ్ యూ చెప్పేసేయ్
అంటొంది ఓ ఆరాటం
ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ||2||
Highlights
Do not miss the logic!
………………………………………………………………………………………………..
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world