|
Context
Song (1&2) Context:
Girl fell in love with boy only by listening to this song and not seeing the boy in person and vice versa!
So the stage (rather screenplay) is set - they are in search of each other. They meet often but unless this song is sung at their presence they can’t recognize each other!
.
Song 3 Context:
రేయి పవలు తను వెతికే పాటకు చిరునామా
ఎదుటే ఇపుడు ఉన్నదని ఎదురై చెప్పమ్మా
ఈ మౌనమింక నీకు తగదు చిరుగాలీ! |
Song (1&2) Lyrics
||ప|| |అతడు|
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ
కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుండదే
నీ కోసమే అన్వేషణ..నీ రూపురేఖలేవో ఎవరినడగాలి
|| పాటల ||
.
||చ|| |అతడు|
నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
తన రూపు తానెపుడూ చూపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది
రెప్పలు తెరిచే మెలకువలో కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కళ్లు ఎవరినడగాలి
||పాటల||
.
||చ|| |అతడు|
పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా..నీ గూటిని చూపుమా
ఏ నిమిషంలో నీ రాగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించీ పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుందీ
|| పాటల ||
.
.
(Contributed by Nagarjuna) |
Song 3 Lyrics
||ప|| | ఖోరస్|
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ
కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుండదే
నీ కోసమే అన్వేషణ..నీ రూపురేఖలేవో ఎవరినడగాలి
|| పాటల ||
.
||చ|| |అతడు|
హృదయాలు ఒడి చేర్చి ఓదార్చే చిరుగాలి
మమ్మల్ని జత చేసే వంతెనవు కావాలి ||2||
అద్దంలా మెరిసే ఓ హౄదయం పగిలింది
ఆ మదిలో వెలుగు చూపించే దారేది
రేయి పవలు తను వెతికే పాటకు చిరునామా
ఎదుటే ఇపుడు ఉన్నదని ఎదురై చెప్పమ్మా
ఈ మౌనమింక నీకు తగదు చిరుగాలీ
ప్రేమను ధ్యానించూ ప్రేమే ఒక జలపాతం
ప్రేమను పూజించూ ప్రేమే ఒక సంగీతం
|ఖోరస్| |ప్రేమను ధ్యానించూ|
……………………………………………………………………………………………… |
Highlights
2000 అఫ్జా Award Winner!
.
If you were Sirivennela this is how you would conceptualize the lyrics, in this context 
What is that “something” you can’t see; without it you can’t breathe; without it your heart won’t celebrate; it doesn’t have any physical shape/color; Well, it should also carry a “song” around the town;
.
Since I said “if you were Sirivennela”, it is no-brainer for you. It is గాలి or చిరుగాలి!
.
Remember in the current context, it is also “love” that can’t be seen in the form of the lover!
An so you figured out the concept for పల్లవి of this song already 
.
Enjoy the complete lyrics.
.
[Also refer to Page 101 of సిరివెన్నెల తరంగాలు & pages 64-66 in "నంది" వర్ధనాలు]
……………………………………………………………………………………………………………………………….. |
|
No Comments »