|
Context
Song (Female) Context:
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా ! (Love towards mom & childhood)
అంతా జ్ఞాపకమే (I remember everything)
.
.
Song (Male) Context:
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా ! (Love towards her)
అంతా జ్ఞాపకమే (I remember everything)
. |
Song (Female) Lyrics
||ప|| |ఆమె|
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా || ఏదో ||
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
|| ఏదో ||
.
||చ|| |ఆమె|
అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్లలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం
|| ఏదో ||
.
||చ|| |ఆమె|
గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్లనే దాచే చోటు జ్ఞాపకం
జామపళ్లనే దోచే తోట జ్ఞాపకం
|| ఏదో ||
.
.
(Contributed by Nagarjuna) |
Song (Male) Lyrics
||ప|| |అతడు|
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా || ఏదో ||
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
|| ఏదో ||
.
||చ|| |అతడు|
వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతి కిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం
చిలకముక్కులా నీ అలక జ్ఞాపకం
|| ఏదో ||
.
||చ|| |అతడు|
మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలో నీ దీపం లా నీ రూపం జ్ఞాపకమే
పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపు రాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం
|| ఏదో ||
.
.
(Contributed by Nagarjuna)
……………………………………………………………………………………………. |
Highlights
తల్లి ప్రేమ + చిన్నతనంపై ప్రేమ (Female Song) & ప్రియురాలిపై ప్రేమ (Male Song)
with the same పల్లవి… ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ….
.
Huh! Fascinating, exhilarating….
.
Enjoy the complete lyrics.
.
[Also refer to Pages 84-85 of సిరివెన్నెల తరంగాలు] |
|
No Comments »