|
Context
Song Context:
నిన్ను వలచి అన్ని మరిచి కలతపడి నిలిచున్నా! |
Song Lyrics
||ప|| |అతడు|
మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను ||2||
ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరెదను
ఓ ప్రియా… ఓ ప్రియా…
||మేఘమై||
.
||చ|| |అతడు|
నిన్ను వలచి అన్ని మరిచి కలతపడి నిలిచున్నా
నిన్ను తలచి కనులు తెరిచి కలలోనే ఉన్నా
|ఆమె|
పాటే నే విన్నది మాటే రాకున్నది వేరే ధ్యాసన్నది లేనే లేకున్నది
ఓ ప్రియా… ఓ ప్రియా…
||మేఘమై||
.
||చ|| |ఆమె|
నిను చూడని కనులేలని కలవరించే హృదయం
నిను వీడని నీ నీడలా సాగింది బంధం
||అతడు|
ప్రేమ భాధన్నది ఎంత తీయ్యనైనది ఎండమావన్నది సెలయేరైనది
ఓ ప్రియా… ఓ ప్రియా…
||మేఘమై||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
………………………………………………………………………………………………
|
|
No Comments »