|
Context
Song Context:
కలతెరగని కలలను చూడు కంటికి కావలి నేనుంటా
.
కళ కరగని వెలుగులు నేడు ఇంటికి తోరణమనుకుంటా |
Song Lyrics
||ప|| |అతడు|
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మా లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మా అందనిదేముందీ
|| కన్నుల ||
.
||చ|| |అతడు|
గున్నమావి గొంతులో తేనె తీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
|ఆమె|
ఎండ మావి దారిలో పంచదార వాగులా కొత్త పాట సాగుతున్నది
|అతడు|
ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో ఆడే సందడిది
|ఆమె|
అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల చీకటిని తరిమే బంధమిది
|అతడు|
కలతెరగని కలలను చూడు కంటికి కావలి నేనుంటా
|ఆమె|
కళ కరగని వెలుగులు నేడు ఇంటికి తోరణమనుకుంటా
|| కన్నుల ||
.
||చ|| |అతడు|
పంచుకున్న ఊసులు పెంచుకున్న ఆశలు తుళ్లి తుళ్లి ఆడుతున్నవి
|ఆమె|
కంచె లేని ఊహలే పంచవన్నె గువ్వలై వెండి అంచు తాకుతున్నవి
|అతడు|
కొత్త జల్లు కురిసిందీ బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈ వేళా
|ఆమె|
వానవిల్లు విరిసింది మిన్నూ మన్నూ కలిసేలా ఎగసే ఈ వేళా
|అతడు|
అణువణువును తడిసిన ఈ తడి అమృతవర్షిణి అనుకోనా
|ఆమె|
అడుగడుగున పచ్చని బాటను పరిచిన వనమును చూస్తున్నా
|| కన్నుల ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
[Also refer to Page 187 of సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….
|
|
No Comments »