Archive for December 25th, 2009

వాన: మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా

Audio Song:
 
Movie Name
   Vaana
Song Singers
   Mallikarjun
Music Director
   Kamalakar
Year Released
   2008
Actors
   Vinay Rai,
   Meera Chopra
Director
   M.S. Raju
Producer
   M.S. Raju

Context

Song Context:
   ఉయ్యాలకే ఉలుకొచ్చిందట ఒళ్లొంచి నువు దిగి వెళ్లావని!
   పట్టీల అడుగే అలిగిందట చెట్టెక్కడం మానుకున్నావని!

Song Lyrics

||ప|| |అతడు|
       మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా
       అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన
                    ||మూతి ముడుచుకున్నది ||
       మాటవరసకైనా తనకు చెప్పనంటూ గీటు దాటకన్నా
       లెక్క చెయ్యనంటూ ఆమెగారి చెయ్యిజారి మనసుగాని పారిపోయింది
                                             ఏమైనా రానందా రమ్మన్నా
                     ||మూతి ముడుచుకున్నది ||
.
||చ|| |అతడు|
       సన్నాయిలా వినిపిస్తున్నవా
       చెవి కొరికి పోయే చిరుగాలులు
       జడివానలా అనిపిస్తున్నవా జడపూల చాటున తడి ఊహలు
       ఇన్నాళ్లు నువ్వైన చూశావటే నీక్కూడా ముద్దొచ్చే అందాలు
       ఇవ్వాళే నీకు తెలిశాయటే ఛీ పాడు అనిపించు అర్థాలు
       ఇంతలో ఇంతలా ఎంత వింత మార్పు వచ్చిందే నీలోనా బాగుందే ఏమైనా
                     ||మూతి ముడుచుకున్నది ||
.
||చ|| |అతడు|
       ఉయ్యాలకే ఉలుకొచ్చిందట ఒళ్లొంచి నువు దిగి వెళ్లావని
       పట్టీల అడుగే అలిగిందట చెట్టెక్కడం మానుకున్నావని
       పైటొచ్చి నీ జట్టు కట్టుకుందని
       ఆటాడే ఈడింక చేరనన్నది
       పారాణికేమంత బరువుందని పాదాన్ని పరిగెత్తనీయకున్నది
       గుండెలో గువ్వలా పెంచుకున్న నిన్ను పిలిచిందే ఓ మేనా పంపాలే ఏమైనా
                      ||మూతి ముడుచుకున్నది ||
.
.
                                     (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………