ఇంద్రుడు చంద్రుడు: లాలిజో లాలిజో ఊరుకో పాపాయి

Posted by admin on 3rd April 2009 in జోలపాట కథ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Indrudu Chandrudu
Singers
   S.P. Balu
Music Director
   Ilaya Raja
Year Released
   1989
Actors
   Kamal Hasan, Vijaya santhi
Director
   Suresh Krishna
Producer
   D. Rama Naidu

Context

Song Context: ఒక జోలపాట by a dad (previously palyboy) to his toddler daughter telling his repentance story!

Song Lyrics

||ప|| |తండ్రి|
       లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
       పారిపోనీకుండా పట్టుకో నా చేయి      || లాలిజో ||
       తెలుసా ఈ ఊసు చెబుతా తల ఊచు
       కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
       ఆలినే కాదంది కాకినే కూడింది
       అంతలో ఏమైంది అడగవే పాపాయి
       పారిపోనీకుండా పట్టుకో నా చేయి
.
||చ||
       మాయనే నమ్మింది బోయతో పోయింది
       దెయ్యమే పూనిందో రాయిలా మారింది
       వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే
       తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది
       కన్నులే విప్పింది గండమే తప్పింది
       ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
       పారిపోనీకుండా పట్టుకో నా చేయి
.
||చ||
       పిల్లలు ఇల్లాలు ఎంతగా ఏడ్చా రో
       గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోశారో
       నేరం నాదైనా భారం మీపైన
       తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
       తల్లిగా మన్నించు మెల్లగా దండించు
       కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
       బుద్దిలో లోపాలే దిద్దుకోనీవమ్మా        || లాలిజో ||
.
.
                 (Contributed by Nagarjuna)

Highlights

Sirivennela thrives on complicated contexts!
Here he got one - a dad is talking to a toddler daughter in the words of her knowledge using the anologies of the child stories she is aware of; Yet communicating his remorsefulness for the past sins; Telling the daughter “పారిపోనీకుండా పట్టుకో నా చేయి”.
Just enjoy this yet another masterpiece!
……………………………………………………………………………………………..
[Also refer to Page 256 in సిరివెన్నెల తరంగాలు]

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)