ఇంద్రుడు చంద్రుడు: నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు

Posted by admin on 3rd April 2009 in ప్లేబోయ్

Audio Song:
 
Movie Name
   Indrudu Chandrudu
Singers
   S.P. Balu
Music Director
   Ilaya Raja
Year Released
   1989
Actors
   Kamal Hasan, Vijaya santhi
Director
   Suresh Krishna
Producer
   D. Rama Naidu

Context

Song Context: A rustic/eccentric playboy song

Song Lyrics

సాకీ:  ఒచ్చంటావో గిచ్చింటివో తీసెయ్ నీయమ్మా
       నచ్చిన సినిమా చూసేయంగా వోసి నాయమ్మా
.
||ప|| |అతడు|
       నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు
       తక్కినవన్ని పక్కనపెట్టి పట్టర ఓ పట్టు
       వెయ్యరా సయ్యంటు నడుముచుట్టు ఉడుంపట్టు
       చిందేరా రయ్యంటు పదం వింటు పద అంటు      ||నచ్చిన||
.
||చ||
       వినరో పిటపిటలాడే పిట్టల కొక్కొరక్కొ      ||ఖోరస్|| కొక్కొరక్కొ
       పదరో చిటపటలాడే ఈడుకు చిక్కిదిగో
       కసితో కుతకుత ఉడికే కళ్ళకు విందిదిగో
       ఎదలో కితకితపెట్టే మల్లెల చిందిదిగో
       చెక్కిలినొక్కుల చిక్కులలో - చిక్కని మక్కువ చిక్కునురో
       చక్కిలిగింత తొక్కిడిలో - ఉక్కిరిబిక్కిరి తప్పదురో
       అక్కర తీర్చే అంగడిరో
       అద్దాల అందాలు అందాలి పదరా                ||నచ్చిన||
.
||చ||
       సరిగా వెతికితే సరదా దొరకక తప్పదురో
       జతలో అతికితే జరిగే చొరవిక చెప్పకురో
       త్వరగా కలబడి ఖానా పీనా కానియిరో
       మరిగే కలతకు జాణలదానా కానుకరో
       తుళ్ళెను అందం కళ్ళెదురా - ఒల్లని పందెం చెల్లదురా
       మల్లెల గంధం చల్లునురా - అల్లరి బంధం అల్లునురా
       అత్తరుసోకే కత్తెరలా మొత్తంగ మెత్తంగ కోస్తుంది కదరా      
                                                        ||నచ్చిన||
 .
                                  (Contributed by Prabha)

Highlights

……………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)