Posted by admin on 11th June 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |ఆమె|
వద్దంటె వినడే పోకిరి ముద్దుల్లో ఒకటే కిరికిరి
అర్జెంటుగా అహా! ఓహో! అనిపించగా
అందాలలో మందారాలే తెంచేసినాడే
|అతడు|
వద్దంటే విననే రామరి
వద్దంటె విననే రామరి ఒళ్ళంత ఒకటే ఆవిరి
.
||చ|| |అతడు|
ఈ మంచుగాలి కొట్టి వేదించు వేడి పుట్టి
ఒళ్ళంత పాకిందమ్మో ఓహో!
|ఆమె|
కవ్వించు కాంక్ష పుట్టి నా సిగ్గు వెన్ను తట్టి
నీ వెంట పంపిందయ్యో
|అతడు|
ఎవరెస్టునైనా కరిగించవా శివమెత్తు నిట్టూర్పులో
|ఆమె|
ఎవరడ్డమయినా ఎదురించవా యువజంట పట్టింపులు
|అతడు|
రాణి యువరాణి ముడివీడుతున్న కైపు చూపులు ||వద్దంటే||
దేహాలలో మన సందేహాలే తగ్గించగా
తాపాలలో ఆహ! సంతాపాలే తప్పించుకోగా ||వద్దంటే||
.
||చ|| |ఆమె|
పెళ్ళీడు ముంచుకొచ్చి అల్లాడు ఆశ రెచ్చి
అల్లేసుకొమ్మందయ్యో
|అతడు|
పిల్లాడి పంచకొచ్చి కిల్లాడి పిచ్చి పెంచి ఒళ్ళోకి రమ్మందమ్మో
|ఆమె|
మంచాలమైకం దించేయనా ఒయ్యారి లంచాలతో
|అతడు|
పొంచున్న దాహం దించేయనా విర్జాజి వర్షాలతో
|ఆమె|
కాని తొలి బోణీ రవి చూడలేని కన్నే మోజుతో
||వద్దంటె వినడే||
||దేహాలలో మన సందేహాలే||
||వద్దంటె ||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)