Posted by admin on 11th June 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
|పల్లవి| అతడు : కూ కుహు ఆమె : కూ కుహు
అతడు :
ఆలకించు ఓ కోయిలా ఊ ఉహు
ఆమె :
ఆశ్రయించి వచ్చామిలా కూ కుహు
అతడు :
మనుగుడుపులకై ఈ గోపికే
ఆమె :
అతిధులమనుకో ఈ పూటకీ
అతడు :
మా మూడు నిద్దర్లకీ
ఆమె :
ఓ నీడ చూపించవా
||ఆలకించు ఓ కోయిలా ||
.
చరణం : అతడు :
తగిన తరుణం కాదని తనువు తహతహలాడదా
ఆమె :
మనువు వెనకే మనసు అడిగే మధువులీయకుంటే వూరుకుంటుందా
అతడు :
కుహు కుహు ..పిలిచిన వయసు
ఆమె :
ఆహ ఉహూలు వినదని తెలుసు
అతడు :
తదుపరి కథలకు తావేదని
ఆమె :
అడిగిన తపనలు తగ్గించనీ
అతడు :
కాసేపు నీ నీడలో
ఆమె :
కాముణ్ణి లాలించనీ
||ఆలకించు ఓ కోయిలా ||
.
చరణం : అతడు :
పరుపు తలగడ లేవని తలపు నిలబడిపోదుగా
ఆమె :
పొగలు రగిలే పడుచు దిగులే తగువు తీర్చమని తరుముతుందిగా
అతడు :
ఎలా మరి యిరుకని అనకు
ఆమె :
ఎదోవిధాన ఇమడద చురుకు
అతడు :
చనువుగ చొరబడు తొలి జంటకి
ఆమె :
చిటికెడు చోటిడు చలిమంటకి
అతడు :
పరువైన నీ ఇంటిలో
ఆమె :
పరువాన్ని పండించనీ
||ఆలకించు ఓ కోయిలా ||
.
.
(Contributed by ఆచళ్ళ శ్రీనివాసరావు) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)