ఒక్కడు: చెప్పవే చిరుగాలి చల్లగా యదగిల్లి … ఎక్కడే వసంతాల కేళీ

Posted by admin on 15th May 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Okkadu
Singers
   Udit Narayan, Sujatha
Music Director
   Mani Sharma
Year Released
   2003
Actors
   Mahesh Babu, Bhoomika
   Chawla
Director
   Guna Sekhar
Producer
   M.S. Raju

Context

Song Context:
     A beautiful romantic song!

Song Lyrics

|ప|| |అతడు|
       చెప్పవే చిరుగాలి చల్లగా యదగిల్లి ||2||
       ఎక్కడే వసంతాల కేళీ…. చూపవే నీతో తీసుకెళ్లి ||2|| ||చెప్పవే||
.
||చ|| |అతడు|
       ఆశాదీపికలై మెరిసే తారకలు
       చూసే తీపి కలై విరిసే కోరికలు
       మనతో జతై సాగుతుంటే
       అడుగే అలై పొంగుతుంది
|ఆమె|
       చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా…
|అతడు|
       ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ
       రెక్కలు విప్పుకు ఎగిరే కళ్లు
       దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవా చీకట్లు
|ఆమె|
       కురిసే సుగంధాల హోలి చూపదా వసంతాల కేళి
|ఖోరస్|
       కురిసే సుగంధాల హోలి చూపదా వసంతాల కేళి || చెప్పవే ||
.
||చ|| |ఆమె|
       యమునా తీరాల కథ వినిపించేలా
       రాధ మాధవుల జత కనిపించేలా
       పాడనీ వెన్నెల్లో ఈ వేళ చెవిలో సన్నాయి రాగంలా
|అతడు|
       కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల
|ఆమె|
       లాహిరి లాహిరి లాహిరి తారంగాలా
       రాతిరి ఏటిని ఈదే వేళ
       జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి
|అతడు|
       ఊపిరే ఉల్లాసంగా తుళ్లీ చూపదా వసంతాల కేళి
|ఖోరస్|
       ఊపిరే ఉల్లాసంగా తుళ్లీ చూపదా వసంతాల కేళి || చెప్పవే ||
.

                             (Contributed by Nagarjuna)

Highlights

“చెప్పవే చిరుగాలి చల్లగా యదగిల్లి
ఎక్కడే వసంతాల కేళీ చూపవే నీతో తీసుకెళ్లి”
Beautiful!
.
చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా!
.
కురిసే సుగంధాల హోలి చూపదా వసంతాల కేళి
.
ఊపిరే ఉల్లాసంగా తుళ్లీ చూపదా వసంతాల కేళి
.
Just cannot resist myself to say - Sirivennela’s patented thought process & lyrical style [i.e., even in romantic songs!]
………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)