కిక్: దిం తన నానినె ధిం తన నానినె… అటు చూడొద్దన్నానా…మాటాడొద్దన్నానా

Posted by admin on 9th May 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Kick
Singers
   Chitra
Music Director
   Thaman S.
Year Released
   2009
Actors
   Ravi Teja, Ileana
Director
   Surender Reddy
Producer
   Venkat

Context

Song Context: A girl debating with herself if/why she is in love

Song Lyrics

       ధిం తన నానినె ధిం తన నానినె || 4||
||ప|| |ఆమె|
       అటు చూడొద్దన్నానా…మాటాడొద్దన్నానా
       వద్దొద్దు అంటే విన్నావంటే మనసా
       ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
       ఈ తలనొప్పేదైనా నీ తప్పేం లేదన్నా
       అయ్యయ్యో అంటారేమో గానీ మనసా
       పడవలసిందేగా నువ్విలా నాలా హింస
       ధిం తన నానినె ధిం తన నానినె || 4||
       ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా
       ఎందుకు బదులిచ్చావే తెలిసీ తెలియని పసి మనసా
                              ||అటు చూడొద్దన్నానా||
.
||చ|| |ఆమె|
       మునుపేనాడు ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాల
       వందలు వేలు ఉండుంటారు
       మతి చెడలేదే ఇలా వాళ్లందరి వల్లా…
|అతడు|
       ఎందుకివ్వాళే ఇంత మత్తెక్కిందో చెబుతావా
       ఏం జరిగుంటుందంటే అడిగిన వాళ్లని తిడతావా
|ఆమె|
       అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలేశావా
       గుండెల్లో గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా
                            ||అటు చూడొద్దన్నానా||
.
||చ|| |ఆమె|
       ఏ దారైనా ఏ వేళైనా ఎదురౌతుంటే నేరం తనదే
       ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
       ఎవ్వరినని ఏం లాభం…ఎందుకు ఎద లయ తప్పిందే
       ఎక్కడ ఉందో లోపం…నీతో వయసేం చెప్పింది
       అలకో ఉలుకో పాపం… ఒప్పుకునేందుకు ఇబ్బందే
       కనకే నాకీ కోపం కన్నెగ పుట్టిన నా మీదే
                                        ||ధిం తన||
.
.
                  (Contributed by Nagarjuna)

Highlights

Interesting debating lyrics between వయసు and మనసు!
.
Compare it with the song(3) of ఏదో ఒప్పుకోనంది

……………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)