గమ్యం: చాల్లేగాని ఏంటా పరాకు ఉన్నట్టుండి ఏమైంది నీకు

Posted by admin on 19th June 2009 in మది ప్రేమలో పడ్డది

Audio Song:
 
Movie Name
   Gamyam
Singers
   Chaitanya, Sunitha
Music Director
   E.S. Murthy & Anil
Year Released
   2008
Actors
   Sharvanand, Allari Naresh,
   Kamalini Mukharjee
Director
   Radhakrishna Jagarlamudi
Producer
   J. SaiBabu

Context

Song Context:
     మది ప్రేమలో పడ్డది!

Song Lyrics

||ప|| |ఖోరస్|
       చాల్లేగాని ఏంటా పరాకు
       ఉన్నట్టుండి ఏమైంది నీకు
|అతడు|
       అయ్యో అని వర్రీ అయిపోకు
       టెల్ మి అని ఎంక్వైరీలన్నీ ఎందుకు
|ఖోరస్|
       మాతోనే నువ్వు ఉంటూ మా ఊసే పట్టనట్టు
       ఏదోలా ఎందుకుంటావ్ నీదీ లోకం కాదన్నట్టు
|ఆమె|
       ఒదిగుంది లోని గుట్టు
       కదిలిస్తే తేనెపట్టు
       వదలదుగా వెంటపడుతూ
       నాకేం తెలుసు ఇది ఇంతేనంటూ
|అతడు|
       మునిగేదాకా లోతన్నది
|ఆమె|
       కొలిచే వీలు ఏమున్నది
|అతడు|
       పరవాలేదు అంటూ మది
|ఖోరస్|
       ప్రేమలో పడ్డది
.
||చ|| ||ఖోరస్||
       ఆమె చెంపలా కందిపోవటం
       ఏమి చెప్పటం ఎంత అద్భుతం
       అందుకే కదా కోరి కోరి కయ్యాలు
|ఆమె|
       అతని కోసమే ఎదురుచూడటం
       బ్రతిమలాడి తను అలక తీర్చటం
       పూటపూట ఎన్నెన్ని చిలిపి కలహాలు
|ఖోరస్|
       జంటలెన్ని చెబుతున్నా ఎన్ని కథలు వింటున్నా
       అంతుపట్టదే ప్రేమా..ఏనాటికైనా…
|ఆమె|
       విన్నాగాని అంటావే కానీ
       ఏమంటోంది ఆకాశవాణి
|ఖోరస్|
       చూశాగాని వేరే లోకాన్నీ
       ఏం చెప్పాలి చూపించే వీలు లేదని
.
||చ|| |ఆమె|
       పక్కకెళ్లిపో పాడు మౌనమా
       కరగవెందుకే కొంటె దూరమా ||పక్కకెళ్లిపో ||
       బయటపడని జత ఏదో చూసుకోరాదా
|అతడు|
       ఎంతసేపు ఈ వింత డైలమా
       కథని కాస్త కదిలించు కాలమా
       టు బి నాట్ టు బి డిబేట్ ఎంతకి తెగదా
|ఆమె|
       కొత్త దారిలో నడక
       ఇప్పుడిప్పుడే గనక
|అతడు|
       తప్పదేమో తడబడక
       అలవాటు లేక
|ఆమె|
       ఇన్నాళ్లుగా ఉన్నాగా నేను
       నువ్వొచ్చాక ఏమైపోయాను
|అతడు|
       నీతో ఇలా అడుగేస్తున్నాను
       ఏ వైపంటే ఏమో ఎలాగ చెప్పను
.
.
                (Contributed by Nagarjuna)

Highlights

మునిగేదాకా లోతన్నది, కొలిచే వీలు ఏమున్నది
పరవాలేదు అంటూ మది ప్రేమలో పడ్డది :)
…………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)