గమ్యం: హత్తెరీ ఎంత హుషారే చింతామణి ఎల్లలు మీరే చిందాపనీ

Posted by admin on 19th June 2009 in రికార్డింగ్ డాన్స్

Audio Song:
 
Movie Name
   Gamyam
Singers
   Gayathri
Music Director
   E.S. Murthy & Anil
Year Released
   2008
Actors
   Sharvanand, Allari Naresh,
   Kamalini Mukharjee
Director
   Radhakrishna Jagarlamudi
Producer
   J. SaiBabu

Context

Song Context:
     రికార్డింగ్ డాన్స్

Song Lyrics

||ప|| |అతడు|
       హత్తెరీ ఎంత హుషారే చింతామణి
       ఎల్లలు మీరే చిందాపనీ
|ఆమె|
       విందడిగారే అందాలని
       ముందుకురారే అందాలని
.
||చ|| |అతడు|
       కొమ్మలో గమ్మున ఉంటే కంటపడవే నిధులు
       కమ్మగా ఘం ఘం అంటూ కబురెడితే నీ సుధలు
       దిరిసెన పువ్వా దర్శనమివ్వా అనవా తుమ్మెదలూ
|ఆమె|
       పాపలా నిదరోమంటే వింటదా ఈడసలు
       ఏపుగా ఎదుగుతు ఉంటే ఒంటిలో మిసమిసలు
       ఎగబడతారే పొగబెడతారే తెగబడి తుంటరులు
|అతడు|
       స్వేచ్ఛగా ఎగురుతు ఉంటే పసివన్నెల జెండా
       భక్తిగా వందనమనరా ఊరు వాడంతా
|ఆమె|
       పచ్చిగా గుచ్చుకుంటే సూదంటి చూపులిట్టా
       పైటిలా నిలబడుతుందా చెక్కు చెదరకుండా
                      |అతడు| ||హత్తెరీ ఎంత ||
                      |ఆమె| ||విందడిగారే||
.
||చ|| |అతడు|
       అరె అరె అరె అరె..
       పిందెలా ఉన్నది కానీ పండెరో కళలన్నీ
       ఎందరో తెలియదు కానీ పిండెరో వలపన్ని
       చంబల్ రాణీ సొంపులలోని సంపదలెన్నెన్నీ..
|ఆమె|
       నిందలో నిజమో కానీ ఎందుకా కథలన్నీ
       మందిలో దొరలే కానీ దొంగలసరెవ్వరని
       గుండెలలోని గూడుపుఠాణి అడిగేదెవ్వరనీ
|అతడు|
       కుందనపు బొమ్మై ఆలి నట్టింట్లో ఉన్నా
       నిన్నొదిలి పోలేరమ్మా ఓ పోలేరమ్మ
|ఆమె|
       చేతిలో అమృతముంటే చేదేలేవయ్యా
       సంతలో అమ్మే అంబలి బాగుంటుందయ్య
                    |అతడు| ||హత్తెరీ ఎంత ||
                    |ఆమె| ||విందడిగారే||
.
.
            (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………..

2 Responses to “గమ్యం: హత్తెరీ ఎంత హుషారే చింతామణి ఎల్లలు మీరే చిందాపనీ”

  1. Praveen Bhamidipati Says:

    పైటిలా
    (not *పైకిలా*)

    పిందెలా (meaning a ripening/just-ripened fruit)
    (not *విందెలా*)

  2. Admin Says:

    Fixed them again.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)