Movie Name
Aarya Singers Sagar, Sumangali Music Director
DeviSri Prasad Year Released 2004 Actors
Allu Arjun, Siva balaji
Anu Mehta Director Sukumar Producer Dil Raju
Context
Song Context: ప్రేమా… నువ్వుంటే!
Song Lyrics
||ప|| |అతడు|
ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో
ప్రేమా… ఆ సందడి నీదేనా…
ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా… ఆ సవ్వడి నీదేనా…
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా… చిరకాలం నా వెంటే
నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం…
నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం
.
||చ|| |అతడు|
పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చెయ్యదా ప్రేమ బాటలో పయనం
దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్లు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సానిత్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం
నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలె గంధం
నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం…
నువ్వుంటే ప్రతి మాటా వేదం నువ్వుంటే ప్రతి పలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం
.
||చ|| |అతడు|
ఉన్నచోట ఉన్నానా ఆకాశం అందుకున్నానా
చెలియ లోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపానా
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయానా
హరివిల్లే… నన్నల్లే… ఈ రంగులు నీ వల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీ వల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా
నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు కూడా పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే
.
.
(Contributed by Nagarjuna)
Highlights
ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో సందడి
నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో సవ్వడి
………
………
“నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే!”
. Astonishing & never-ending stream of thoughts! ………………………………………………………………………………………………..
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world