రెడీ: నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Ready
Singers
   Sagar, Gopika Poornima
Music Director
   DeviSri Prasad
Year Released
   2008
Actors
   Ram, Genelia
Director
   Sreenu Vytla
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context: A logic-packed Love Song!

Song Lyrics

||ప|| |అతడు|
       నా పెదవులు నువ్వైతే, నీ నవ్వులు నేనవుతా
       నా కన్నులు నువ్వైతే, కల నేనవుతా
|ఆమె|
       నా పాదం నువ్వైతే, నీ అడుగులు నేనవుతా
       నా చూపులు నువ్వైతే, వెలుగే అవుతా
|అతడు|
       చెరో సగం అయ్యాం కదా ఒకే పదానికి
|ఆమె|
       ఇలా మనం జతై సదా శిలాక్షరం అవ్వాలి ప్రేమకి || నా పెదవులు ||
.
||చ|| |అతడు|
       కనిపించని బాణం నేనైతే,
|ఆమె|
       తియతియ్యని గాయం నేనవుతా
|అతడు|
       వెంటాడే వేగం నేనైతే,
|ఆమె|
       నేనెదురవుతా
|అతడు|
       వినిపించని గానం నేనైతే,
|ఆమె|
       కవి రాయని గేయం నేనవుతా
|అతడు|
       శృతి మించే రాగం నేనైతే,
|ఆమె|
       జతి నేనవుతా
|అతడు|
       దివి తాకే నిచ్చెన నేనైతే,
|ఆమె|
       దిగివచ్చే నెచ్చెలి నేనవుతా
|అతడు|
       నిను మలిచే ఉలినే నేనైతే,
|ఆమె|
       నీ ఊహలు ఊపిరి పోసే చక్కని బొమ్మను నేనవుతా || నా పెదవులు ||
.
||చ|| |అతడు|
       వేధించే వేసవి నేనైతే,
|ఆమె|
       లాలించే వెన్నెల నేనవుతా
|అతడు|
       ముంచెత్తే మత్తును నేనైతే,
|ఆమె|
       మైమరపవుతా
|అతడు|
       నువ్వోపని భారం నేనైతే,
|ఆమె|
       నిన్నాపని గారం నేనవుతా
|అతడు|
       నిను కమ్మే కోరిక నేనైతే,
|ఆమె|
       రా రమ్మం టా
|అతడు|
       వెలిగించే మంటను నేనైతే,
|ఆమె|
       రగిలించే జంటను నేనవుతా
|అతడు|
       పదునెక్కిన పంటిని నేనైతే,
|ఆమె|
       ఎరుపెక్కిన చెక్కిలి పంచిన చక్కెర విందే నేనవుతా || నా పెదవులు ||
.
.
                                 (Contributed by Nagarjuna)

Highlights

Let us decode Sirivennela logic!
.
What is given: నా పెదవులు నువ్వైతే, నీ నవ్వులు నేనవుతా
Question: నా పెదవులు నువ్వైతే => నా నవ్వులు కూడా నువ్వవుతావు గదా,
               But then how does it lead to నీ నవ్వులు నేనవుతా?
.
Answer: Let us crack the implicit logic here.
            నా పెదవులు నువ్వైతే => నా నవ్వులు కూడా నువ్వవుతావు గదా.
            నా పెదవులు నువ్వైతే implicitly నీ పెదవులు నేనౌతా.
            Then నీ పెదవులు నేనౌతా => నీ నవ్వులు నేనవుతా.
            So నా పెదవులు నువ్వైతే, నీ నవ్వులు నేనవుతా.
     వెరసి => “చెరో సగం అయ్యాం కదా ఒకే పదానికి!”
.
Next ఇక రెండు చరణాలలో the concept “we are two halves of the same పదం” is expressed in various interesting forms!
.
Huh! Amazing!
………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)