నువ్వొస్తానంటే నేనొద్దంటానా: అదిరే అదిరే కన్నే అదిరే

Posted by admin on 11th September 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nuvvostanante
      Nenoddantana

Song Singers
   Jassi Gift, Kalpana
Music Director
   DeviSri Prasad
Year Released
   2005
Actors
   Siddharth, Trisha
Director
   Prabhu Deva
Producer
   M.S. Raju

Context

Song Context:
.
Lovers are ecstatic, for all the hurdles are clear now!

Song Lyrics

||సాకీ||
       శివశివ మూర్తివి గణనాథా ||2||
       శివుని కొమరుడవు గణనాథా ||2||
       ఛల్ సిరికీ హరికీ మనువంట ||2||
       భళరే అనరా జనమంతా ||2||
       హేయ్..ఘల్లుమంటు గజ్జ కట్టి చిందు కొట్టే జగమంతా
.
||ప|| |అతడు|
       అదిరే అదిరే కన్నే అదిరే ||2||
|ఆమె|
       కుదిరే కుదిరే అన్నీ కుదిరే
|అతడు|
       శృతి ముదిరే ముదిరే మురిపాలు
|ఆమె|
       మతి చెదిరే చెదిరే సరదాలు
|అతడు|
       మొదటిసారిగా ఎదురయిందిగా వయసు వేడుకా ఓ.. ఓ..
                                        ||అదిరే ||
.
||చ|| |అతడు|
       ఏం మాయ మెలికో..కలికి ఒంటి కులుకో
       నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో
|ఆమె|
       ఏం నిప్పు కణికో…అదేం పంటి కొరుకో
       వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో
|అతడు|
       హెయ్..వరసై పిలిచే అందాలు..
       అరె మనమై చిలికే గంధాలు
|ఆమె|
       మనసే గెలిచే పంతాలు
       అరె మనువై కలిపే బంధాలు
|అతడు|
       రణము చేయగా రమణి కోరిక అదుపు దాటదా
                                       || అదిరే ||
.
||చ|| |ఆమె|
       పన్నీటి చినుకో…పసిడిపంట జిలుగో
       కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో
|అతడు|
       పందార తునకో…పదం లేని తెలుగో
       మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో
|ఆమె|
       హే ఎదురై రానీ మేనాలూ
       చెవిలో పడనీ మేళాలు
|అతడు|
       అరె..అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు
|ఆమె|
       మదన దీపిక మదిని మీటగా ఎదురు లేదిక…
                                       || అదిరే ||
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)