ఆట: నిను చూస్తుంటే చెడిపోతానే

Posted by admin on 16th October 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Aata
Song Singers
   Siddharth, Sumangali
Music Director
   DeviSri Prasad
Year Released
   2007
Actors
   Siddharth, Ileana
Director
   V. N. Aditya
Producer
   M.S. Raju

Context

Song Context:
     A Love Song

Song Lyrics

||ప|| |అతడు|
       నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవు కదా
|ఆమె|
       పొగిడావంటే పడిపోతానే తప్పని గొడవ కదా
|అతడు|
       పద పద అంటుందే పదే పదే నీ అందం
|ఆమె|
       ఆహా మహా బాగుందే హొయ్ మతి చెడే ఆనందం
|అతడు|
       ఉరకలెత్తే యవ్వనం తరుముతుంటే కాదనం
       సనం ఓ సనం సనం ఓ సనం
                           || నిను చూస్తుంటే ||
.
||చ|| |అతడు|
       తీగ నడుము కదా ఊగి తడబడదా
       రేకు విరిసిన సోకు పరువుకు సాయపడమనదా
|ఆమె|
       ఆడ మనసు కదా బైటపడగలదా
       అంత సులువుగ అంతు దొరకదు వింత పొడుపు కథ
|అతడు|
       కబురు పంపిన పయ్యెద ఇపుడు వేయకు వాయిదా
       సనం ఓ సనం సనం ఓ సనం
                           || నిను చూస్తుంటే ||
.
||చ|| |అతడు|
       లేడి కన్నులతో వగలాడి వన్నెలతో
       కంటబడి మహ కొంటెగా కవ్వించుతుంటదిగో
|ఆమె|
       వాడి తపనలతో మగవాడి తహతహతో
       జంటపడమని వెంటపడి వేధించు తొందరలో
|అతడు|
       పెదవి అంచున ఆపినా అసలు సంగతి దాగునా
       సనం ఓ సనం సనం ఓ సనం
                           || నిను చూస్తుంటే ||
.
.
              (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)