జయీభవ: ఒక్కసారి ఫక్కుమంటూ నవ్వుకుందాం

Posted by admin on 25th October 2009 in గెలవాలంటే కలహించాలా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   JayeeBhava
Song Singers
   Karthik, Shreya Goshal
Music Director
   S. Thaman
Year Released
   10/23/2009
Actors
   Kalyan Ram, Hansika Motwani
Director
   Naren Kondepati
Producer
   Kalyan Ram 

Context

Song Context:
         పక్కవారి చింత కొంత పంచుకుందాం

Song Lyrics

||ప|| |అతడు|
       ఒక్కసారి ఫక్కుమంటూ నవ్వుకుందాం
       పక్కవారి చింత కొంత పంచుకుందాం
       పువ్వు లేని కొమ్మనైతే మోడు అంటాం
       నవ్వలేని జన్మనైతే ఏమిటంటాం
|ఆమె|
       చిక్కనైన చీకటిని వెళ్ళమందాం
       చక్కనైన వేకువను చేరమందాం
       సందెపొద్దు సందడిని ఆలకిద్దాం
       నిద్దరింక చాలు కాని మేలుకుందాం
.
||చ|| |అతడు|
       అరె చల్ చల్ హర్ పల్ హల్ చల్ చేయక
       అసలు యెటు అని అడుగని పరుగులు తీయక
       మన కునుకును కలతలు కొరుకుతూ ఉండగా
       మరి ఎప్పుడిక బతుకున సుఖపడు తీరీక
|ఆమె|
       కనుపాపల్లో నడి రేయంతా తెల్లబోయేలా
                         ఒక కిరణం చాలుగా
       మన ఊపిరిలో వడగాలంతా చల్లారేలా
       చిరు చినుకుల తొలకరి తగలద తడిగా
                                                      ||ఒక్కసారి||
.
||చ|| |ఆమె|
       మన గడపకు చిటికెడు పసుపును పూయక
       తన అడుగిట మోపదు ఏ ఒక పండుగ
       మన మనసుకు తొడిగిన ముసుగులు తీయక
       కనపడదుగ మనలో మనుషుల పోలిక
       మెదడే వుంటే మెథడే లేదా
       అది వాడుంటే ఎదురవదే ఆపద
       గెలవాలంటే కలహించాలా
       తెలివే వుంటే నువ్వు తలచిన ప్రతి పని సులువుగా అవ్వదా
.
.
                               (Contributed by Phani)

Highlights

.
    చిక్కనైన చీకటిని వెళ్ళమందాం
    చక్కనైన వేకువను చేరమందాం
    సందెపొద్దు సందడిని ఆలకిద్దాం
    నిద్దరింక చాలు కాని మేలుకుందాం
.
    కనుపాపల్లో నడి రేయంతా తెల్లబోయేలా
                      ఒక కిరణం చాలుగా
    మన ఊపిరిలో వడగాలంతా చల్లారేలా
    చిరు చినుకుల తొలకరి తగలద తడిగా
.
    మెదడే వుంటే మెథడే లేదా
    అది వాడుంటే ఎదురవదే ఆపద
.
    గెలవాలంటే కలహించాలా
    తెలివే వుంటే నువ్వు తలచిన ప్రతి పని సులువుగా అవ్వదా
………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)