నేను మీకు తెలుసా: ఇక చెప్పక తప్పదుగా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nenu Meeku Telusa
Song Singers
   Achu,
   Sunitha Sarathy
Music Director
   Achu
Year Released
   2008
Actors
   Manchu Manoj,
   Sneha Ullal,
   Riya Sen
Director
   Ajay Shastry
Producer
   Lakshmi Manchu

Context

Song Context:
    నీ వల్లే ఇదంతా
    నన్నే నీ వెంట దారి తప్పించి తిప్పించి వదిలేస్తావా ఒంటరిగా!

Song Lyrics

||ప|| |అతడు|
       ఇక చెప్పక తప్పదుగా అని అనుకొని వచ్చా ఈ వేళ
       చెబితే నువ్వేమంటావో తెలియదుగా
|ఆమె|
       అరె ఎప్పటికప్పుడిలా…ఆహా
       ఇపుడే మొదలని అనుకోవాలా
       సరెలే వింటా మళ్లీ మరో కొత్త కథలా
|అతడు|
       ఇంకా ఏం చెప్పందే మొన్నెప్పుడో విన్నట్టే
       నువ్వేదోలా ఉన్నావంటే వదిలేద్దాంలే
|ఆమె|
       ఇవ్వాళే ఈ పూటే తేల్చేద్దాం కానీలే
       సిద్ధంగానే ఉన్నాలే
.
||చ|| |అతడు|
       తడితడి పెదవుల తళతళ మెరుపులు
       తగిలిన తలపులు విలవిలలాడేలా నవ్వితే ఎలా
|ఆమె|
       పొడిగా విడిగా మడిగా గొడుగాపాలా తమరినిలా
|అతడు|
       కిల కిల సడి కవ్విస్తుందో కసిరిందో గుర్తించేదెలా
|ఆమె|
       మనసేమందో వినలేవా సరిగా
|అతడు|
       నాలా నువ్వై నిలువెల్లా నిను నువ్వే
       గమనిస్తే నాలాగే గల్లంతై పోతావే
|ఆమె|
       పోనీలే క్షమించెయ్ పేచీలెందుకులే
       చాల్లే ఎన్నాళ్లీ దోబూచీ రాజీ పడదాంలే చక్కా
.
||చ|| |ఆమె|
       ఎదురుగ దొరికితే కదలవు మెదలవు ఉలకవు పలకవు
                             నిలబడి చూస్తావే ఎంత సేపిలా
|అతడు|
       అపుడూ ఇపుడూ ఎపుడూ కొత్తగా ఉందే ఎందుకిలా
|ఆమె|
       నీ తికమక చూస్తూ సమయమాగాలా? నీ కోసమలా
|అతడు|
       ఫరవాలేదే నువు లేవా జతగా
|ఆమె|
       ఆకాశంలో ఎగరేస్తానంటావా
       నన్నీ మాలోకంలో ముంచేస్తానంటావా
|అతడు|
       నీ వల్లే ఇదంతా
       నన్నే నీ వెంట దారి తప్పించి తిప్పించి వదిలేస్తావా ఒంటరిగా
                               || ఇక చెప్పక తప్పదుగా ||
.
.
                     (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)